పన్నుల మాదిరిగా వయస్సు పెరగడం మనమందరం ఎదుర్కోవాల్సిన వాస్తవం. ఎప్పుడు యెదుగుదల ఆగిపోతుంది మరియు వయస్సు మీదపడటం ఎప్పుడు ఆరంభమవుతుందో నన్ను చెప్పమని మీరు నిశ్చయించుకోలేదు కదూ-నేను చెప్పను! మన జీవిత ప్రయాణంలో మనం పరివర్తనలోకి ప్రవేశిస్తున్నామని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయని గ్రహించగలము (ఈ ఉపాయము ఎలా ఉంది?).
శారీరకంగా, వయస్సు మీదపడుతున్న “శరీరము” నెమ్మదిస్తుంది. చకచకా పనులు చేసే మీరు యిప్పుడు ఆయాసపడటం ప్రారంభిస్తారు. మీరు నిలబడటం కంటే ఎక్కువగా కూర్చోవడానికి . . . చేయటం కంటే ఎక్కువ చూడటానికి. . . మీ పుట్టినరోజును గుర్తుంచుకోవడం కంటే మరచిపోవటానికి ఎక్కువగా ఇష్టపడతారు! మానసికంగా, వయస్సు మీదపడుతున్న మెదడు ఉపశమనం కోసం ఆరాటపడుతుంది. మునుపటిలాగా మీకు గుర్తుండదు, అలాగే మీరు స్పందించవలసిన విధముగా స్పందించరు. ఈ రోజు గురించి కంటే నిన్నటి గురించి మరియు రేపటి గురించి మీరు ఎక్కువ ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆవేశపూరితముగా, మీరు “నాకు ఎప్పుడూ సంభవించదు” అని ఒకప్పుడు ప్రమాణం చేసిన వింత భయాలు మరియు భావాల వంటి వాటికి లోనవుతారు:
- కొన్ని సమయాల్లో ప్రతికూలంగా, విమర్శనాత్మకంగా మరియు ముక్కుమీద కోపంతో ఉండటం.
- చిన్నవారైన వారు మరింత బాధ్యత వహించటానికి ఇష్టపడకపోవడం.
- అవసరంలేనివారుగా మరియు “అడ్డముగా” ఉన్నట్లు అనిపిస్తుండటం.
- తరచూ “ఒకవేళ” తో పరధ్యానముతో ఉండటం.
- మునుపటి తప్పులు మరియు తప్పుడు నిర్ణయాలపై అపరాధ భావనతో ఉండటం.
- మరచిపోబడినట్లు, ప్రేమించబడనట్లు, ఒంటరిగా ఉన్నట్లు, మరియు గమనించబడనట్లు అనిపిస్తుంది.
- శబ్దాలు, వేగం, ఆర్థిక అనిశ్చితి మరియు వ్యాధితో బెదిరింపబడటం.
- సర్దుబాటు మరియు పొసగటం యొక్క అవసరాన్ని ప్రతిఘటించడం.
ఇవన్నీ-యింకా అనేకమైనవి-మీరు ఒకప్పుడు చాలా సామర్థ్యముగల, శక్తిగల, ఆవశ్యమైన మరియు సఫలమైనవారుగా ఉన్న ఆ రోజుల జ్ఞాపకములను-మరింత ఘోరముగా తయారుచేస్తాయి. మీరు అద్దంలోకి చూస్తున్నప్పుడు, మీ మంటి మోహముపై వయస్సుతోపాటు ముడతలు రావడం ప్రారంభించాయని మీరు అంగీకరించవలసి వస్తుంది . . . మరియు మీ సంధ్యా సంవత్సరాలు విలువైనవని నమ్మడం కష్టం.
ఎంత తప్పు! ఎంత భయంకరమైన తప్పు! అలాంటి ఆలోచనలు ఎంత వినాశకరమైనవి! అలాంటి ఆలోచన మిమ్మల్ని సందేహం, విచారం, పనికిరానితనం మరియు దుఃఖం మొదలగు నాలుగు నిరాశామయమైన గోడలతో చుట్టి, స్వీయ-జాలి యొక్క జైలు గదికి ఎంత త్వరగా శిక్షించగలదు.
దేవుని పితరులు ఎల్లప్పుడు ఆయన యొక్క శ్రేష్ఠమైన స్వాస్థ్యముగా ఉన్నారు. అబ్రాహాము వయస్సులో పెరిగి పరిపక్వత చెందిన తర్వాత చాలా ప్రభావవంతంగా ఉన్నాడు. ఎనభై ఏళ్ళు వచ్చేవరకు ఏ పరిమాణంలోను విజయం కొరకు మోషే వాడబడలేదు. దేవుని ఉత్తమ లక్ష్యాలను ఆస్వాదించడం ప్రారంభించినప్పుడు కాలేబుకు ఎనభై-ఐదేళ్ళు. రాబోయే శతాబ్దాలలో ఆధ్యాత్మికత మరియు దైవభక్తికి శాశ్వత ప్రభావాన్ని చూపిన “ప్రవక్తల సమాజము” ను స్థాపించడానికి ఇశ్రాయేలు దేవుడు అతన్ని నడిపించినప్పుడు సమూయేలు బాగా ముసలివాడు. తన చివరి రోజులలో బాగా అలసిపోయి, ఈ రోజు మనం ఎంతో ఆదరించే పత్రికలలో ప్రోత్సాహక పదాలు వ్రాసిన పౌలును దేవుడు ఉపయోగించిన విధానాన్ని ఎవరు ఖండించగలరు!
వయస్సు పెరగడం వల్ల దానితోపాటు కష్టాలు, బాధలు ఉన్నాయని గ్రహించడంలో ఎవ్వరూ విఫలమవ్వరు. అవి నిజంగా ఉంటాయి. కానీ మీ ఎడారి అనుభవంలోని వేడి ఇసుకను మాత్రమే చూసి, అక్కడక్కడ ఉన్న సుందరమైన ఎండమావులను పోగొట్టుకోవడం (అవి చాలా తక్కువగా ఉన్నప్పటికీ) ద్వారా మీ జీవిత ప్రయాణం యొక్క చివరి భాగాన్ని నిర్జలమైన, రుచిలేని ఓర్పునకు మార్చడం ప్రతి ఒక్కరినీ దయనీయంగా చేస్తుంది.
దయచేసి మర్చిపోవద్దు-దేవుడు మిమ్మల్ని ఇంతకాలం జీవింపజేయాలని నిర్ణయించుకున్నాడు. మీ వృద్ధాప్యం తప్పు కాదు . . . పొరపాటు కాదు . . . తరువాత పుట్టిన ఆలోచన కాదు. దేవుని ఎండమావుల యొక్క నీటి నుండి సేదతీర్చు పానీయముతో మీరు మీ నాలుకను చల్లబరచుకొని, మెత్తబరచు మీ చిరునవ్వు చిందించడం ఈపాటికే జరిగుండాలి కదా? మీరు చాలా కాలముగా దాహముగొని యున్నారు.
మీ మూలాలను మరింత లోతుగా చేయడం
సామెతలు 16:31; కీర్తన 92:14; యెషయా 46:4; తీతుకు 2:2-3
క్రొత్తగా ఏదైనా చేయటం మొదలుపెట్టండి
- ఒక వృద్ధుడితో సమయం గడపండి మరియు అతని ఇష్టమైన జ్ఞాపకాలలో కొన్నింటిని తెలుసుకోండి మరియు దేవుడు అతన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకున్నాడో, లేదా దేవుడు తనను ఉపయోగించుకుంటాడని అతను ఆశిస్తున్నాడో తెలుసుకోండి.
- మీరు నమ్మకమైన మరియు విలువైన పాత్రగా ఉండులాగున మీ భవిష్యత్తు గురించి ప్రార్థించడం ప్రారంభించండి.
- దైవభక్తి కలిగియున్నట్లు మీరు భావించే ముగ్గురు వృద్ధులను ఈ ప్రశ్న అడగండి: దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించడానికి మీరు ఏమి చేస్తారు లేదా భిన్నంగా ఏమి చేస్తారు? వారి మాటలను శ్రద్ధగా వినండి.