వెబ్‌స్టర్ తన నిఘంటువులో “పేరెంటింగ్ (పెంపకము)” విస్మరించటం ఘోరముగా ఉన్నది . . . కానీ “గ్రాండ్ పేరెంటింగ్ (తాతానానమ్మల పెంపకము)” ను విస్మరించడం అసమర్థతకు క్షమించరాని దానికి మధ్య ఎక్కడో ఉంది! సరే, సరే, ఇది అధికారిక పదం కాదన్నమాట. కాబట్టి వెబ్‌స్టర్ యొక్క ప్రధాన రిఫరెన్స్ వర్క్ యొక్క శ్రేణుల్లో స్థానం సంపాదించడానికి ఆంగ్లో-సాక్సన్ భాషా సిద్ధాంతంలో తగినంత మూలాలు లేవు. గనుక మన సంస్కృతి యొక్క పదజాలంలో గుర్తింపు సంపాదించడానికి పదాలు ఆమోదించబడాలనే నిబంధనలను యెవరు లక్ష్యపెడతారు? నేను ఖచ్చితంగా పెట్టను. . . మరియు వెబ్‌స్టర్ విస్మరించడానికి ఎంచుకున్న పనిని మనస్సాక్షి కలిగిన వేలాది మంది ప్రజలు కూడా లక్ష్యపెట్టరు.
చాదస్థపు పండుముసలివాడైన వెబ్‌స్టర్ స్క్రూజ్‌కు ప్రత్యామ్నాయ వ్యక్తిగా నిలబడుచున్నాడు. లేదా అతను దివంగత W. C. ఫీల్డ్స్ లాగా పిల్లలను ఇష్టపడకుండా ఉండవచ్చు. మరోవైపు, అతను బహుశా ప్రతిదీ నియమప్రకారం ఆడాడు మరియు తన భావోద్వేగాలను తన సాహిత్య సేవలో అనుమతించలేదు.
చాలా ఘోరం. అలాంటి వ్యక్తులు గొప్ప పండితులను తయారు చేయవచ్చు, కాని కూర్చునేందుకు అడ్డాలను, పట్టుకునేందుకు చేతులను, తమతో కలసి పాడటానికి లేదా తమకు స్కేటింగ్ నేర్చుకోవడంలో సహాయపడేవారి కోసం యెదురుచూస్తున్నవారు ఉన్నత పాఠశాలల్లో సంపాదించిన గొప్ప డిగ్రీలను లేదా అనవసరమైన వ్యాకరణమును గూర్చి అస్సలు పట్టించుకోరు. కాబట్టి తలనెరసిన పెద్దమనిషి లేదా దయగల స్త్రీ కొన్ని పదాలను విడగొట్టి మాట్లాడినా లేదా మాటల్లో తడబడినా ఏమైంది? నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే, ఇక్కడ వారు తలవాల్చుకోవటానికి, మాట్లాడటానికి, కలిసి నవ్వడానికి, వారినుండి నేర్చుకోవడానికి, ప్రక్కన నడవడానికి, మరి ముఖ్యంగా కౌగిలించుకోవడానికి ఒకరు ఉన్నారని చిన్నపిల్లలు తెలుసుకోవాలి. అదే పెద్దలు “మీరు మీ పక్కను సిద్ధం చేసుకున్నారా?” లేదా “మీరు మీ హోమ్ వర్క్ పూర్తి చేశారా,” లేదా “అంట్లు కడగడం మీ వంతు కాదా?” వంటి ప్రశ్నలను అడగకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తాతానానమ్మలకు ఇష్టమైనది ఏమంటే, అక్కునజేర్చుకోవడం. అలాగే వారికిష్టమైన ప్రశ్న ఏమంటే, “నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?” అలాగే వారికి ఇష్టమైన మాటలు ఏమంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా బంగారం.” వారు తప్పులు మరియు వైఫల్యాలను కనిపెట్టి చూడరు; వారు వాటిని క్షమించేస్తారు. మీరు మీ చివరి రూపాయిని అవివేకంగా ఖర్చుచేసినట్లు వారికి గుర్తుండదు; వారు దానిని మరచిపోతారు. వారు మీకోసం చదువుచున్నప్పుడు వారు పేజీలను దాటవేయరు. . . నీళ్ల మీద రాయి వేసి అది ఎంత దూరం వేయగలరో మీరు చూడాలనుకున్నప్పుడు వారు “తొందరగా కానివ్వు” అని కూడా అనరు. వారు వీలైతే ఆగి మీతో పాటు లాలీ ఐస్ ని కూడా చప్పరిస్తారు.
అన్నింటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు, వారు వినాలనుకుంటున్నారు. పెద్దవైన, గంభీరమైన ఉపన్యాసాలు ఉండవు . . . “నీ గురించి నువ్వు సిగ్గుపడాలి” మరియు “ఇది తెలివితక్కువతనం!” వంటి విమర్శలూ ఉండవు. ఇది హాస్యాస్పదంగా ఉంది, కాని డబ్బు, ఆస్తులు మరియు దుస్తులు వంటివి మీకంటే ముఖ్యమైనవి కావు అనే అభిప్రాయాన్ని మీరు పొందుతారు. అలాగే ఎక్కడికైనా సమయానికి చేరుకోవడం కంటే ఆ యాత్రను ఆస్వాదించడం ముఖ్యమైనదిగా భావిస్తారు.