నేను క్షమిస్తాను. . . కానీ నేను ఎప్పటికీ మరచిపోను. మనము ఇలాంటివి చాలానే విన్నాము, దానిని “సహజమైనది మాత్రమే” అని త్రోసివేయడం సులభం. అది సమస్య మాత్రమే! ఇది మనం ఆశించే అత్యంత సహజమైన ప్రతిస్పందన. అసహజమైనది కాదు. ఇది విషాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తుంది.
గ్రేట్ చర్చ్ ఫైట్స్ అనే తన పుస్తకంలో, ఒకే ఇంట్లో కలిసి జీవించిన ఇద్దరు పెళ్లికాని సోదరీమణుల గురించి లెస్లీ ఫ్లిన్ చెప్పారు, అయితే, ఒక చిన్న సమస్యపై తీరని విభేదం కారణంగా, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు (క్షమించకపోవడం వలన కలిగే తప్పించుకోలేని పరిణామాల్లో ఇది ఒకటి). వారు తమ చిన్న ఇంటి నుండి బయటకు వెళ్లలేకపోవడమో లేదా బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడమో జరిగింది కాబట్టి, వారు అవే గదులను ఉపయోగించడం, అదే టేబుల్ వద్ద తినడం, అవే ఉపకరణాలను ఉపయోగించడం మరియు అదే గదిలో పడుకోవడం కొనసాగించారు . . . అన్ని విడిగా . . . ఒక్క మాట కూడా మాట్లాడకుండా. బలపముతో గీసిన గీత నిద్రపోయే ప్రదేశాన్ని విభజించింది, ముఖద్వారములను అలాగే నిప్పుగూడును వేరు చేసింది. ఒకరి భూభాగములోనికి మరొకరు అడుగుపెట్టకుండా, ఇద్దరూ వచ్చేవారు మరియు వెళ్లపోయేవారు, వంటచేసుకునేవారు మరియు భుజించేవారు, కుట్టుపని చేసుకునేవారు మరియు చదువుకునేవారు. చిమ్మ చీకటిలో, ఇద్దరూ ఒకరి శ్వాసను మరొకరు వినగలిగేవారు, కానీ, తప్పు ఏదైనా సరే ఇద్దరూ క్షమించడానికి మరియు విడుదల చేయడానికి వేయవలసిన మొదటి అడుగు వేయడానికి ఇష్టపడనందున, వారు చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా జీవించారు.
క్షమించడానికి మరియు రుణాన్ని రద్దు చేయడానికి నిరాకరించడం ద్వేషము యొక్క గురుతులు వంటి ఇతర విషాదాలకు దారితీస్తుంది. ఎన్ని క్రైస్తవ సంస్థలు విడిపోయి (తరచుగా చిన్న సమస్యల మీద), తర్వాత మరొక దిశలో తిరిగిపోయి, విరిగిపోయి, చీలిపోయి మరియు క్రూరంగా మూర్ఖ పట్టుగలిగి లేవు? క్షమాపణ యొక్క వారసత్వాలను సృష్టించడం కంటే, ఎన్ని కుటుంబాలు ఆగ్రహం యొక్క జ్ఞాపకాలను పట్టుకోవాలని ఎంచుకోవడంలేదు? మరియు సంఘాలు ఈ విషయంలో చాలా ఘోరంగా ఉండగలవు!
ఒక సాయంత్రం నేను వేసవి బైబిల్ సమావేశ కూడికలో మాట్లాడిన తర్వాత, ఒక మహిళ తాను మరియు ఆమె కుటుంబం అమెరికా అంతటా విడిది చేస్తున్నామని చెప్పారు. వారి ప్రయాణాలలో, వారు ఒక పట్టణం గుండా వెళ్లారు, ఆమె ఎన్నటికీ మరచిపోలేని ఒక పేరుతో ఉన్న సంఘము గుండా వెళ్ళింది—దేవుని అసలు సంఘము, రెండవది.
మన వివాదం వ్యక్తిగతమైనదైనా లేదా పబ్లిక్ విషయం అయినా, మనల్ని కించపరిచిన వారి పట్ల మనం ఎలా స్పందిస్తామనే విషయంలో సేవకుని హృదయం కలిగియున్నామా అని మనము త్వరగా బయలుపరుస్తాము. మనకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన సామరస్యపూర్వక సంబంధాలను విభజించే ద్వేషపు స్మారక చిహ్నాలను నిర్మించే వరకు మనల్ని బాధపెట్టిన విషయాలను పట్టుకోవాలని ఎంచుకుంటామా . . . లేదా మనల్ని బాధపెట్టిన వారిని క్షమించి, ఆపై అపరాధమును విడచిపెట్టడం ద్వారా శాశ్వత క్షమాపణ యొక్క వారసత్వములను సృష్టించడానికి . . . రుణాన్ని రద్దు చేయడానికి మనము ఎంచుకుంటామా? ఆ చివరి మాటలను మరచిపోవద్దు.
“సరే, సరే-మీరు క్షమించబడ్డారు, కానీ నేను మిమ్మల్ని విడుదల చేస్తానని ఆశించవద్దు!” అని ఊరకనే చెబితే సరిపోదు! అంటే మన మనస్సులో ద్వేషపు స్మారక చిహ్నాన్ని నిర్మించుకున్నాము, అది అసలు క్షమాపణే కాదు.
నేను వెళ్లే ముందు, నన్ను ఇది చెప్పనివ్వండి: ఏమి జరిగిందో మీరు మరచిపోవాలని లేదా ఈ సంఘటనను మీరు మీ జ్ఞాపకశక్తి నుండి చెరిపివేయగలరని లేదా దూషణకు లేదా నేర ప్రవర్తనకు లేదా ఆర్థిక అప్పులకు మీరు ఎవరినో ఒకరిని బాధ్యులను చేయవద్దని నా ఉద్దేశం కాదు. మనము వాస్తవంలో జీవిస్తున్నాము. అత్యాచార బాధితులు వారి జ్ఞాపకశక్తిలోనుండి చెప్పలేని నేరాన్ని తొలగించడం అసాధ్యం. చెట్టునుండి రాలిన ఆకులను తొలగించినట్లుగా చిన్ననాటి దూషణ జ్ఞాపకాలను తొలగించలేము. శారీరక మరియు భావోద్వేగాలతో కూడిన గాయములు భయంకరమైన నొప్పికి శాశ్వతమైన చిత్రాలు.
నేను చెప్పేది ఏమిటంటే, మనము ప్రజలను అపరాధం నుండి విడుదల చేయాలి మరియు నేరాన్ని ఇకపై వారి తలపై ఉంచకూడదు. మనము “రుణాన్ని రద్దు చేయడాన్ని” ఎంచుకున్నప్పుడు, మన హృదయాలలో దాగి ఉన్న చీకటి భావోద్వేగాల నుండి, మనం ప్రజలను ఎన్నడూ వదలలేము అనే కట్లను విప్పుతాము. దీన్ని ఎప్పటికీ విడిచిపెట్టను. వాస్తవానికి, జీవితాన్ని తలక్రిందులను చేసిన నేరాలను అనుభవించినవారికి, ప్రజలను క్షమించడం మరియు విడుదల చేయడాన్ని కోరుకోవటమనేది నిరంతర ప్రక్రియ. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి– ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.