మీరు మీ జీవితంలో పనిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రతిరోజూ పనికి వెళతారు, కంప్యూటర్‌ను ఆన్ చేస్తారు, ఉదయం 8 గంటలకు మీ ఇంజిన్‌లను ప్రారంభిస్తారు, మధ్యాహ్నం కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు, కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ మనస్సు మరియు శరీరాన్ని నియంత్రణలో ఉంచుకుంటారు. మరలా రేపు–ఇదే పునరావృతం అవుతుంది. ఎక్కడో విన్నట్లుగా ఉంది కదండీ?
కాబట్టి వీటన్నింటిలో దేవునితో మీ సంబంధం ఎలా పెరుగుతుంది? సులభమైన శోధన ఏమిటంటే మీ జీవితాన్ని రెండు భాగాలుగా విభజించడం: వృత్తి-బహిరంగమైనది; విశ్వాసము-వ్యక్తిగతమైనది.
కానీ మీరు మీ వృత్తిలో నిమగ్నమై మీ జీవితంలో ఎంత సమయం గడుపుతున్నారో పరిశీలిస్తే, క్రీస్తుతో మీ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఇదే అనువైన ప్రదేశం. జీవితానికి యెదురుపడే మీ విశ్వాసము ఈ సాధారణ రంగాలతో మీరు గుర్తించగలరా?
విశ్వాసానికి ఒక రూపాన్ని ఇవ్వడం
పనిలో ఉన్న మీ స్నేహితులకు మీరు “దైవభక్తిగలవారు” అని తెలుసు ఎందుకంటే . . .
- మీరు సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు అప్పుడప్పుడు ప్రస్తావించారు.
- వారు సంక్షోభంలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థిస్తానని మీరు వాగ్దానం చేసారు.
- మీ గురించి అది “ఏదో” ఒకటి ఉంది: విభిన్నమైనప్పటికీ ఆకర్షణీయమైనది.
- మీరు సంక్షోభంలోకి వెళ్లడాన్ని వారు చూశారు, అయిననూ ఇంకా “ఏదో” కొనసాగించడాన్ని వారు చూశారు.
మీ శైలి ఏదైనప్పటికీ, మీ జీవితాన్ని మధురమైన “క్రీస్తునుగూర్చిన జ్ఞానముయొక్క సువాసన”గా మార్చమని ప్రభువును అడగండి (2 కొరింథీయులకు 2:14). దేవుని కృపను మాదిరిగా చూపించడానికి మార్గాలను వెతకండి మరియు “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి ”(1 పేతురు 3:15).
వేడి వ్యాఖ్యలు మరియు ఉద్దేశపూర్వకమైన అమిత్రభావం
పనిదినమంతటా, మీరు ఎప్పుడైనా ఈ క్రింది విధంగా ఆలోచించారా?
- తీవ్రతరంగా ముగియని ఒక సంభాషణను మనం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను.
- అతని మెమో నన్ను కదిలించింది. అతను నా గురించి అలా ఎలా ఊహించగలడు? ఏదైనా మాట్లాడటానికి నేనే ఎందుకు ఉండాలి? నేను నిందను భుజాన వేసుకుని ఇరుక్కుపోతాను.
- ఈ ప్రదేశం ఒక టెలివిజన్ సిరీస్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది నాటకం. కొన్నిసార్లు ధారావాహిక కార్యక్రమం. కానీ ఇది ఎన్నడూ హ్యాపీ డేస్ కాదు.
తరచుగా సంఘర్షణ వేదికపై, మీ విశ్వాసం మరింత బలపడుతుంది. ఆధిపత్యాలు చెలాయించడం లేదా అపార్థాల వెనుక, దేవుడు నియంత్రణలో ఉన్నాడని మీరు విశ్వసించవచ్చు. ఎఫెసీయులకు 4:31-32 ని మాదిరిగా చూపడానికి మీకు సహాయం చేయమని ఆయనను అడగండి: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము. . . . మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”
నిర్వహించడానికి బహు కష్టతరమైన పరిస్థితిలో లోతుగా చిక్కుకోవడం
కొన్నిసార్లు, పని మధ్యలో, మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారా . . .
- నేను ఈ స్థితికి ఎలా వచ్చాను?
- “అంతా కలిసే ఉన్నాం” అన్నట్లుగా నేను కనిపించవచ్చు, కానీ నా గుండె ఎంత వేగంగా పరుగెత్తుతుందో ఎవరూ గుర్తించరని నేను అనుకొంటున్నాను.
- ప్రజలు నా నుండి నిజంగా ఏమి ఆశిస్తున్నారు? నాకు అంత అర్హత ఉందా?
- ఈ స్థలంలో నేను దేవుని కొరకు ఎలా జీవించగలను?
శతాబ్దాల క్రితం, ఎస్తేరు అనే స్త్రీ ఈ ప్రతిస్పందనలలో ఏదోయొకదానిని పంచుకొని ఉంటుంది. ఆమె జీవితానికి మరియు మీ జీవితానికి సంబంధించిన పాఠాన్ని ఎస్తేరు 4:14లో క్లుప్తంగా చెప్పవచ్చు: “నీవు ఈ సమయమునుబట్టియే [దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడేమో] రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము?” మీరు ఆయనను విశ్వసించులాగున దేవుడు మీ పని యొక్క ప్రతి సంఘటనను ముందుగానే ప్రణాళిక చేసాడు. (సామెతలు 3:5-6ని ధ్యానించండి.) ఈరోజు మీరు ఆయనకు ఏమి అప్పగించాలి?
మీరు రేపు పని చేయడానికి బయలుదేరినప్పుడు, వివాదాలలో, అవకాశాలలో అలాగే మీ రోజులోని ముఖ్య సమయంలో–దేవుడు కూడా పని చేస్తున్నాడని నమ్మండి.
Adapted from Charles R. Swindoll, “Faith in the Workplace,” Insights (May 2000): 1-2. Copyright © 2000, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.