దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు?
అందరూ ఆలోచన చేయవలసినప్పటికీ, మనలో కొంతమంది మాత్రమే ఈ ప్రశ్న గురించి ఎక్కువసేపు ఎంతో కష్టపడి ఆలోచించి ఉంటారు. మనం జీవితాన్ని శ్రేష్ఠంగా జీవిస్తున్నామా లేదా జీవితాన్ని అధ్వాన్నంగా జీవిస్తున్నామా అనేది మన సమాధానం నిర్ణయిస్తుంది.
ప్రాచీన ప్రవక్త అయిన మీకా దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆలోచించాడు. మీకా యొక్క దైవిక ప్రేరేపిత సమాధానం యొక్క సరళత ప్రాచీన యూదాలోని సంపన్న సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది మీకు కూడా దిగ్భ్రాంతిని కలిగించవచ్చు.
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది;
న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు,
ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. (మీకా 6:8)
మీకా యొక్క ఈ మూడు మాటలు శ్రేష్ఠముగా జీవించే జీవితాన్ని కొనసాగించడానికి మనకు రూపురేఖలను అందిస్తాయి.
- న్యాయముగా నడచుకోవాలి. న్యాయముగా నడచుకోవడానికి, మనం మొదట దేవునితో ప్రార్థనలో, ఆయన వాక్యంలో మరియు ఆయన ప్రజలతో సమయం గడపడం ద్వారా ఏది న్యాయమైనదో నిర్ణయించుకోవాలి. మనము న్యాయమైన మార్గాన్ని కనుగొన్న తర్వాత, మనము ప్రతిఘటనను ఆశించాలి. కానీ ప్రతిఘటన మధ్యలో, దేవుడు తన ప్రణాళికను పర్యవేక్షిస్తాడని మరియు దానిని పూర్తి చేసేలా చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి.
- కనికరమును ప్రేమించాలి. ప్రపంచం చాలా అరుదుగా కనికరము కలిగి ఉంటుంది, కానీ దేవుడు న్యాయవంతుడు–ఆయన సార్వభౌమ హస్తం అన్ని పరిస్థితులను నియంత్రిస్తుంది అని గుర్తించడం ద్వారా–మరియు మన పరిస్థితులను దేవుని ఆశీర్వాదమునకు కారణాలుగా అంగీకరించడం ద్వారా మనం కనికరమును పెంపొందించుకోవచ్చు.
- దీనమనస్సును మాదిరిగా కలిగి ఉండాలి. దీనత్వము స్వార్తముగా ప్రవర్తించదు. కానీ అది జరిగిన తప్పుకు బాధ్యతను వహిస్తుంది. ఇంకా, అది మృదువైనది, మరియు అది దేవుని సార్వభౌమ నియంత్రణలో ఉంటుంది.
శ్రేష్ఠముగా జీవించిన జీవితం దేవుని ఘనపరుస్తుంది, ఇతరులను ప్రేరేపిస్తుంది మరియు జీవించేవారికి ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనీసం ఆరు బహుమానములు పేర్కొనదగినవి:
- ఆదర్శప్రాయమైన స్వభావం యొక్క నిరంతర కృషి
- స్పష్టమైన మనస్సాక్షి యొక్క నిరంతర ఉపశమనం
- సర్వశక్తిమంతునితో సాన్నిహిత్యం యొక్క వ్యక్తిగత ఆనందం
- మార్గదర్శకంగా ఉండటం యొక్క గొప్ప ఆధిక్యత
- చక్కగా పూర్తి చేసినందుకు శ్రేష్ఠమైన బహుమతి
- మనం ప్రేమించే వారి కోసం అమూల్యమైన, చిరకాల వారసత్వం
ఇది శ్రేష్ఠముగా జీవించిన జీవితం!
Copyright © 2012 by Charles R. Swindoll, Inc