నేను న్యూ ఇంగ్లాండ్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో, థాయర్ ఎస్. వార్షా అనే ఉపాధ్యాయుని గురించి విన్నాను, అతను కాలేజీకి వెళ్లాలనుకునే విద్యార్థుల బృందాన్ని బైబిల్‌పై ప్రశ్నించాడు. బైబిల్ యాస్ లిటరేచర్ అనే కోర్సును యునైటెడ్ స్టేట్స్‌లో టాప్ సెకండరీ స్కూల్‌గా పరిగణించబడే న్యూటన్ (మసాచుసెట్స్) హైస్కూల్‌లో బోధించడానికి ప్రణాళిక వేసే ముందు క్విజ్ పెట్టారు. విద్యార్థుల నుండి అతనికి వచ్చిన ప్రత్యుత్తరాలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా ఉన్నాయి:
సొదొమ మరియు గొమొర్రా ప్రేమికులు.
యెజెబెలు అహాబు యొక్క గాడిద.
కొంతమంది విద్యార్థులు అక్రోపోలిస్‌లో నాలుగు జీవులు కనిపించాయని, క్రొత్త నిబంధనలోని సువార్తలను మత్తయి, మార్కు, లూథర్ మరియు యోహాను రాశారని . . . హవ్వ ఒక ఆపిల్ నుండి సృష్టించబడిందని మరియు యేసు మోషే చేత బాప్తిస్మము పొందాడని అనుకున్నారు. నిజంగా! చదువుపరముగా క్లాస్‌లో మొదటి ఐదు శాతంలో ఉన్న ఒక వ్యక్తి మూర్ఖమైన సమాధానమును ఇలా ఇచ్చాడు.
ప్రశ్న: గొల్గొతా అంటే ఏమిటి?
సమాధానం: అపొస్తలుడైన దావీదును చంపిన బలాఢ్యుని పేరే గొల్గొతా.
ఇది బాధాకరముగా లేకపోయి ఉంటే, ఎంతో ఉల్లాసముగా ఉండేది. సామాన్య ప్రజలు లిఖితపూర్వకమైన దేవుని వాక్యముపట్ల ఎంత నిరక్షరాస్యత కలిగియున్నారో చూస్తే ఆశ్చర్యంగా లేదూ? సంఘాలు మరియు ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మరియు గుడారాలతో నిండిన ప్రపంచంలో, పుస్తకాలకే పుస్తకాన్ని బాగా అవగాహన చేసుకున్న విద్యార్థులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మనకు హార్డ్‌బ్యాక్, పేపర్‌బ్యాక్, వస్త్రం మరియు తోలు వంటి పలురకాల్లో లేఖనము లభ్యమవుతుంది . . . అనువాదాలు మరియు భావానువాదాలు లెక్కించడానికి చాలా ఎక్కువ . . . ఎరుపు అక్షరాల సంచికలు, పెద్ద-ముద్రణ అనువాదములు, నిఘంటువుల వలె పెద్దవి మరియు మైక్రోచిప్‌ల వలె చిన్నవి . . . అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ బైబిల్ నిరక్షరాస్యత ఒక తరము తర్వాత మరొక తరము అందిపుచ్చుకుంటుంది.
మన దేశ సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ నైపుణ్యం బైబిల్ ప్రాథమికాలపై మనకున్న పట్టును కప్పివేయుచు భయంకరమైన స్థాయికి తీసుకొనిపోయింది. కాబట్టి, మతాధికారుల ఆంతరంగిక భాష అయిన లాటిన్‌లో లేఖనము యొక్క ప్రతులను పుల్పిట్‌కు బంధించినప్పటి . . . అలాగే జీవితాన్ని మార్చే సత్య బోధనల గురించి ప్రజలకు తెలియకుండా చేసినప్పటి చీకటి యుగాలకు సమానమైన యుగం వైపు మనం వెళ్తున్నాము. కానీ నేను ఒక గొప్ప వ్యత్యాసాన్ని చూస్తున్నాను; ఆ రోజుల్లో, బైబిల్ అజ్ఞానం బలవంతం చేయబడింది. . . మన కాలంలోనైతే ఇది స్వచ్ఛందంగా జరుగుచున్నది. అదిగో అక్కడే విచారకరమైన వాస్తవం ఉన్నది.
మనము ఎవరిపై నిందలు వేయాలి? ఆరోపణలు పొందడానికి ఎవరు అర్హులు? మన ప్రపంచంలోని బైబిల్ కాలేజీలదే తప్పని కొందరు చెబుతారు. కొంత సమస్య అక్కడే దాగియున్నది. మన ప్రపంచం చుట్టూ చూస్తున్నప్పుడు, యేసు దైవత్వము, ఆయన కరుణాధారమైన మరణము, లేదా ఆయన రెండవ రాకడ వంటి ప్రాముఖ్యమైన సత్యాలకు కట్టుబడిలేని బైబిల్ ప్రొఫెసర్‌లను మనం చూడవచ్చు. ఇది మనకు ఇబ్బంది కలిగించుచున్నప్పటికీ, దేవుని చిత్తమంతయు బోధిస్తూ మరియు ఉపదేశిస్తూ . . . సరైన వాటిపై తమ దృష్టిని నిలిపే బైబిల్ కళాశాలల విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
ఇతరులు పుల్పిట్ మీద ఉన్నవారిని నిందిస్తారు. బలహీనమైన బోధ ఒక సంఘాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. పుల్పిట్ మీదనుండి చెప్పే బోధ అస్పష్టమైనదైతే అది తప్పనిసరిగా సంఘ సభ్యుల కళ్ళకు అస్పష్టతను కలిగిస్తుందని నేను ఎన్నో సంవత్సరాలబట్టి చెప్పుచున్నాను. మన బోధకులు వారి ప్రాథమిక బాధ్యత దగ్గరకు తిరిగి వెళ్లాలి: దేవుని ప్రజలకు లేఖనాలను ప్రకటించడం మరియు ఆయనతో సమాధానమునకు మార్గం చూపించడం.
ఇంకా కొందరు సాతాను సంబందమైన, ఒత్తిడి కలిగించే వ్యవస్థ అని మనం పిలిచే ఈ లోకమును-సమాజమును, అనగా ఈ లోకము-“బైబిల్‌మీద మతోన్మాదమైన, అవివేకమైన నమ్మకం” విషయమై చేసే ఒప్పించే అభ్యర్ధనలు మరియు విద్యావిషయక వాదనలను నిందిస్తారు. దీని సత్యాలను స్వీకరిస్తే, మేధోపరమైన ఆత్మహత్యకు సమానమని మనకు చెప్పబడింది. ఈ అబద్ధాన్ని ప్రచారం చేసే అంత్యక్రియలు ఏర్పాటు చేయు వ్యక్తి దగ్గర సమాధి తప్ప . . . భూమిలో గొయ్యి తప్ప వారు అర్పించడానికి బైబిల్ స్థానంలో మరేమీ లేదు.
కానీ తుది విశ్లేషణ ప్రకారం, బైబిల్ సంబంధమైన అజ్ఞానం అనేది వ్యక్తిగత కోరిక-ఇది మీ కోరికే. కట్ట తెగిపోకుండా ఉండటానికి ఏదైనా చేయబోతున్నట్లయితే, కారటం ఆపడానికి మీ వ్రేలు ఉపయోగించాలి . . . త్వరగా చేయాలని నా ఉద్దేశం.