95వ కీర్తన చదవండి.
కొన్నిసార్లు మీకు ప్రార్థన చేయాలని అనిపించనప్పుడు లేదా ప్రభువుతో మాట్లాడాలని మీకు అనిపించినా సరే మాటలను సేకరించలేనప్పుడు, ఆ పాత పద్ధతిని ప్రయత్నించండి–మీ అనేక ఆశీర్వాదములను లెక్కించండి, వాటిని ఒక్కొక్కటిగా లెక్కించండి.
మీరు దేనికి కృతజ్ఞత కలిగియున్నారో బిగ్గరగా చెప్పడం ప్రారంభించినప్పుడు మీరు చింతలు, బాధలు మరియు స్వీయ ఆందోళనల నుండి ఎలా పారవశ్యము చెందుతారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే మీ దృష్టి మీ అవసరాల నుండి తండ్రి దయ మరియు ప్రేమ వైపు మళ్లుతుంది. ఇది ప్రయత్నించండి:
పైకి చూడండి . . . ప్రభువా, నీకు వందనములు . . .
- మా పరిస్థితులపై మీ సార్వభౌమ నియంత్రణకై
- మా పాపపు స్థితిలో మేము ఉన్నప్పటికీ మీ పరిశుద్ధ స్వభావమునకై
- మాకు దిశానిర్దేశం చేసే మీ వాక్యమునకై
- మా అపరాధాన్ని తొలగించే నీ దయకై
చుట్టూ చూడండి . . . ప్రభువా, నీకు వందనములు . . .
- మా అద్భుతమైన దేశము కొరకై
- సన్నిహిత కుటుంబ సంబంధాల కొరకై
- ఇతరులకు సహాయం చేసే అవకాశం కొరకై
- నివసించడానికి ఒక స్థలము, ధరించడానికి వస్త్రములు, తినడానికి ఆహారం కొరకై
లోపల చూడండి . . . ప్రభువా, నీకు వందనములు . . .
- నీ సృష్టి సౌందర్యాన్ని చూసే కళ్ల కొరకై
- ఉత్సుకత, సృజనాత్మకత మరియు సమర్థత కలిగిన మనస్సుల కొరకై
- ఆనందాలు మరియు ఇటీవలి విజయాల జ్ఞాపకాల కొరకై
- చెదరిన కలలు మరియు మమ్మల్ని విధేయులను చేసే బాధల కొరకై
- స్వస్థత మరియు నిరీక్షణను కలిగించే హాస్యం కొరకై
- ఆయన మన అత్యున్నత స్తుతులకు మరియు కృతజ్ఞతకు అర్హుడు. సమస్తమైన మహిమ ఆయనకే చెందుతుంది.
మీరు ప్రార్థన చేయలేకపోతే, వ్యక్తిగతీకరించిన ఆశీర్వాదాల జాబితాను రూపొందించుకోండి.
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000) 328. Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.