తీతుకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు తనను తాను “దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడు” అని పిలుచుకొని తీతు‌కు రాసిన పత్రిక రచయిత తానే అని గుర్తించుకున్నాడు (తీతుకు 1:1). తీతు‌తో పౌలుకు ఉన్న సంబంధం యొక్క మూలం మర్మముగా మరుగుచేయబడి ఉంది. అయినప్పటికీ అతను పౌలు పరిచర్యలో మారుమనస్సుపొంది ఉంటాడని మనం తెలుసుకోవచ్చు. తీతు‌ను “విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు” అని పిలిచాడు (1:4). మూడవ మిషనరీ ప్రయాణంలో పౌలుతో కలిసి తీతు వెళ్ళాడు, ఈ సమయంలో అపొస్తలుడు అతన్ని కనీసం ఒక్కసారైనా కొరింథుకు పంపాడు (2 కొరింథీయులకు 2:12–13; 7:5–7, 13–15; 8:6, 16–24). సువార్త కోసం స్నేహితుడిగా మరియు తోటి ఉద్యోగిగా పౌలు తీతును ఎంతో గౌరవనీయమైన స్థానంలో ఉంచాడు.ఇతరులకు తీతు చూపిస్తున్న అనురాగం, శ్రద్ధ మరియు ఆదరణను పౌలు ప్రశంసించాడు.

మనమెక్కడ ఉన్నాము?

అపొస్తలుడు తన మొదటి రోమా జైలు శిక్ష నుండి విడుదలైన తరువాత, క్రీస్తుశకం 63 లో నికొపొలి నుండి తీతుకు పౌలు తన పత్రిక రాశాడు. తిమోతిని ఎఫెసులో పరిచర్యకు విడిచిపెట్టిన తరువాత, పౌలు తీతు‌తో కలిసి క్రేతు ద్వీపానికి వెళ్ళాడు. వారి ఉనికి యొక్క తొలినాళ్ళలో ఆ ద్వీపం యొక్క సంఘములను తీతు నడిపించాలని మరియు నిర్వహించాలని పౌలు ఉద్దేశించాడు. పెంతెకొస్తు (అపొస్తలుల కార్యములు 2:11) దినమున పేతురు చేసిన ప్రసంగం ముగిసిన వెంటనే సువార్త క్రేతు‌లో వ్యాపించిందనడంలో సందేహం లేదు, పౌలు తీతు‌ను నాయకత్వ పదవికి నియమించడానికి కొన్ని వారాల ముందు పౌలు మరియు తీతు ఈ ద్వీపంలో బలముగా సువార్త ప్రకటించారు.

తీతుకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

మానవజన్మ మెత్తుటను గూర్చిన మూడు సారాంశాలు తీతు పత్రికలో ఉన్నాయి. క్రైస్తవుడు లోకంలో మరియు వ్యక్తిగత జీవితాలలో దేవుని కార్యమును చూడగలిగే ఒక ఆధారాన్ని ఈ ప్రత్యక్షత అందిస్తుంది (తీతుకు 1:1-4; 2:11-14; 3:4-7 ). ఈ మూడు భాగాలలోనూ క్రీస్తులో దేవుని ప్రత్యక్షత లేదా స్వరూపం కలిగి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రత్యక్షతలో క్రైస్తవ విశ్వాసము పాతుకుపోయింది. యేసు అనే వ్యక్తిలో కుమారుడైన దేవుడు మానవ శరీరాన్ని దాల్చినపుడు మాత్రమే దేవునిపై విశ్వాసుల యొక్క విశ్వాసం నిశ్చయమై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన కృపను మానవాళిపై కురిపించాడు. కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపము నుండి పవిత్రపరచి, విశ్వాసులను తనకొరకు పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ దేవుని కృప ఈ ప్రస్తుత యుగంలో నీతిగల మరియు దైవిక జీవితాలను జీవించాలని మనకు నిర్దేశిస్తుంది (2:11–3:8).

తీతుకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

తీతు‌కు రాసిన పత్రికలోని ప్రత్యక్షత యొక్క సిద్ధాంతం, వేదాంత సత్యం పట్ల జాగ్రత్తగా దృష్టి పెట్టడం ద్వారా సరైన జీవనాన్ని ఉత్పత్తి చేసే సందేశాన్ని కలిగి ఉంది. క్రేతు‌లోని సంఘాలు ఇతర సంఘాల మాదిరిగానే తప్పుడు బోధకులకు సులభంగా అవకాశం కలిగించాయి, కాబట్టి క్రేతు‌లోని విశ్వాసుల యొక్క సిద్ధాంతపరమైన స్వచ్ఛత మరియు మంచి ప్రవర్తనను పర్యవేక్షించడానికి నమ్మకమైన పెద్దల బృందాన్ని ఏర్పాటు చేయాలని పౌలు తీతు‌ను ఆదేశించాడు. పౌలు తీతును “ హితబోధకనుకూలమైన సంగతులను బోధించుమని” (తీతుకు 2:1) హెచ్చరించాడు, ఇది యువ కాపరి యొక్క ప్రాధమిక పాత్ర అని స్పష్టమైన దిశానిర్దేశం చేసాడు.

ఏది ఏమయినప్పటికీ, విశ్వాసుల గుంపు దృఢమైన సిద్ధాంతాన్ని స్వీకరించినప్పుడు, "సత్కార్యములను" యిచ్చు మార్పుచెందిన శుద్ధమైన జీవితాలను ఫలితముగా పొందుకుంటారు (తీతుకు 2:7, 14; 3:8, 14 లో ప్రస్తావించబడింది). దేవుని కృప అన్ని సత్కార్యములకు ప్రేరణ. పౌలు తీతుకు నిర్దిష్ట సమూహాల పాత్రల గురించి అనగా-వృద్ధులు, వృద్ధ మహిళలు, యౌవన పురుషులు, యౌవన స్త్రీలు మరియు దాసుల గురించి సూచనలు ఇచ్చాడు, అలాగే విశ్వాసులందరికీ వారి ప్రవర్తన గురించి సాధారణ సూచనలు ఇచ్చాడు. సరైన జీవనం చాలా అవసరం, ఎందుకంటే క్రీస్తు "సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి. . . తన్నుతానే మనకొరకు అర్పించుకొని," "పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను" (తీతుకు 2:14; 3:5).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మీ జీవిత ప్రణాళికంతటిలో దేవుని గురించి మీ నమ్మకాలను మీరు ఎంత గంభీరమైనవిగా పరిగణిస్తారు? దేవుని గురించి మన నమ్మకాలు మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని తీతు పత్రిక మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు యొక్క మూర్తిమంతము మరియు స్వభావం గురించి లేదా త్రిత్వము యొక్క సిద్ధాంతం గురించి ఉత్తేజితులవటం ఈనాటి విశ్వాసులకు కొంచెము కష్టమే. ఏదేమైనా, బలమైన సిద్ధాంతాన్ని బోధించే మరియు ప్రకటించే సంఘము దాని ప్రజల జీవితాల్లో ఫలములను చూస్తుందని పౌలు స్పష్టం చేశాడు. ప్రజలు తమ పాపాల నుండి రక్షింపబడటమే కాక, దేవుని కృప వారిని పునరుద్ధరింపబడిన మరియు శుద్ధి చేయబడిన జీవితాలతో రక్షించే విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రేరేపిస్తుంది.

నేడు చాలా సంఘాలు తమ విశ్వాసం యొక్క పరిమాణం గురించి ప్రకటించడం కంటే ఆరాధన మీద, అనగా-సంగీత శైలులు, లైటింగ్ మరియు భవన రూపకల్పనల మీద ఎక్కువ దృష్టి సారించాయి. సంఘ ఆరాధన యొక్క రూపం క్రీస్తు కొరకు దాని సమాజాన్ని చేరుకోవటానికి చాలా ముఖ్యమైనది. అయితే, బలమైన సిద్ధాంతం యొక్క దృఢమైన ఆధారం లేకపోతే, సంఘము నిలకడలేని అణగిపోవు ఇసుక మీద దాని పునాది వేసుకుంటుంది. మీ స్వంత జీవితంలో సిద్ధాంతానికి ప్రాధాన్యతనివ్వండి, అలాగే మీ సంఘాల్లో కూడా ప్రోత్సహించండి. క్రీస్తులో దృఢమైన పునాది కంటే ప్రాముఖ్యమైనది మరేదీ లేదు. సత్కార్యములతో నిండిన జీవితాన్ని జీవించుటకు కృప కంటే ప్రేరణనిచ్చేది మరొకటి లేదు.