రెండవ తిమోతికి

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు తిమోతికి తన రెండవ పత్రిక రాసే సమయానికి, యువ కాపరి నాలుగు సంవత్సరాలుగా ఎఫెసులోని సంఘానికి పరిచర్య చేస్తున్నాడు. అలాగే పౌలు నుండి తన మొదటి పత్రికను అందుకుని కూడా నాలుగు సంవత్సరాలు అయిపోయినవి. ఒక దశాబ్దం కంటే ముందు అపొస్తలుడితో ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి తిమోతి పౌలుకు నమ్మకమైన పరిచారకుడు. అప్పటి నుండి, తిమోతి పౌలుతో పాటు రెండవ మరియు మూడవ మిషనరీ ప్రయాణాల కాలంలో, త్రోయ, ఫిలిప్పీ మరియు కొరింథు వంటి ప్రదేశాలలో సేవ చేశాడు. పౌలు మూడవ మిషనరీ ప్రయాణంలో సుమారు మూడేళ్ళు పౌలుతో కలిసి ఎఫెసులో సేవ చేసిన తిమోతి ఎఫెసీయులకు పరిచర్య చేయటానికి స్థిరపడినప్పుడు అతనేమీ ఎఫెసీయులకు అపరిచితుడు కాదు. పౌలు ఎఫెసు సంఘములోని ఈ యువ నాయకుడికి ఇబ్బందులు మరియు పరీక్షల నేపథ్యంలో ప్రోత్సాహం మరియు ధైర్యాన్ని అందించుటకు మళ్ళీ రాశాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీస్తుశకం 67 లో చనిపోయే ముందు పౌలు 2 తిమోతిని చీకటి మరియు నిరుత్సాహపరచు రోమా జైలు గది నుండి వ్రాసాడు. రోమా చక్రవర్తియైన నీరో క్రీ.శ. 54 లో సింహాసనం అధిరోహించినప్పటి నుండి నెమ్మదిగా పిచ్చి ముదురుతూ వచ్చి చివరికి రోమా యొక్క గొప్ప అగ్ని ద్వారా పెరిగిపోయి క్రీ.శ. 64 లో సగం నగరాన్ని కాల్చివేసింది. రోమా నివాసితులు గగ్గోలు పెట్టడంతో, క్రైస్తవులు నీరోకు అనుకూలమైన లక్ష్యంగా మారారు. అతను తన నగరం సంసిద్ధముగా లేకపోవటానికి విశ్వాసులను బలిపశువులుగా ఉపయోగించాడు. ఈ హింసలో చిక్కుకున్న వారిలో పౌలు ఒకడు. అలాగే ఈ లేఖ రాసిన వెంటనే రోమా అధికారుల చేత పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడు.

రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

తిమోతికి రాసిన రెండవ పత్రిక తన మరణానికి ముందు పరిచర్య చివరిలో, పౌలు యొక్క చిత్రాన్ని అందిస్తుంది. పత్రికలోని కొన్ని వ్యక్తిగత వివరాలు ఒక వ్యక్తి తన సంగతులను పరిష్కరించుకోవడం మరియు అనివార్యమైన దానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పత్రిక ముగింపులో, పౌలు గణనీయమైన సంఖ్యలో వ్యక్తులను ప్రస్తావించాడు-కొందరు ఆయనకు అన్యాయం చేసారు మరికొందరు ఆయనతో కలిసి నమ్మకంగా సేవ చేసారు (2 తిమోతి 4:9–21). పౌలు తిమోతికి “సంఘము యొక్క స్థితి” గూర్చి ప్రసంగం ఇస్తున్నట్లుగా ఉంది, తిమోతికి తమ పరిచయస్తుల మరియు స్నేహితుల ప్రస్తుత స్థితి గురించి తాజా సమాచారాన్ని యిస్తున్నాడు, తద్వారా పౌలు యొక్క నిష్క్రమణ తరువాత యువ కాపరి ముందుకు కొనసాగవచ్చు.

రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

అపొస్తలుడి రాబోయే మరణంతో తిమోతికి పరిచర్య మరింత కష్టమవుతుందని పౌలు అర్థం చేసుకున్నాడు. (నిజమే, పౌలు రాసిన ఈ పత్రిక తరువాత, తన విశ్వాసం నిమిత్తం తిమోతి జైలు పాలయ్యాడు [హెబ్రీయులు 13:23]). క్రీస్తు నిమిత్తం విశ్వాసులను వారి జీవితాలను చక్కగా గడపాలని ప్రోత్సహించేటప్పుడు సంఘాన్ని బలమైన సిద్ధాంతం యొక్క పరిధిలో ఉంచడమనే తిమోతి యొక్క పని తరచుగా నిష్ఫలమైన మరియు కష్టమైన పని అని పౌలుకు తెలుసు. కష్టాలు వచ్చినప్పటికీ, తిమోతి తాను నేర్చుకున్న విషయాలలో కొనసాగాలని, పౌలు నుండి మాత్రమే కాకుండా తన తల్లి మరియు అవ్వ నుండి కూడా యువ కాపరికి ఇవ్వబడిన విశ్వాసం యొక్క గొప్ప వారసత్వాన్ని పొందుకోవాలని పౌలు కోరుకున్నాడు (2 తిమోతి 1:5–6; 3:14–15).

వృద్ధాప్య అపొస్తలుడు నాలుగు సంవత్సరాల ముందు తిమోతికి రాసిన పత్రికలో ప్రముఖంగా చూపిన ఒక పదబంధాన్ని ఉపయోగించినప్పుడు పౌలు ప్రోత్సాహంలో మనస్సును తట్టే చాలా ముఖ్యమైన లక్షణం సంభవించినది. ఆ మునుపటి పత్రికలో, పౌలు తిమోతికి “మంచి పోరాటము పోరాడుము” (1 తిమోతి 1:18; 6:12) అని హెచ్చరించాడు. కానీ ఈ పత్రికలో, పౌలు ఆ పదబంధాన్ని తన వైపు మళ్ళించుకున్నాడు, అతను “మంచి పోరాటము పోరాడితిని. . . నా పరుగు కడ ముట్టించితిని. . . విశ్వాసము కాపాడుకొంటిని” అని రాశాడు (2 తిమోతి 4:7). ఎఫెసులోని సంఘము యొక్క యువ కాపరి తన గురువు ధైర్యంగా విశ్వాసం పట్ల తన ఓర్పును మరణం వరకు కూడా మాదిరిగా చూపాడని తెలుసుకోవడం ఎంత గొప్ప ప్రోత్సాహమో.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

రెండవ తిమోతి మనల్ని మరణం అంచుకు తీసుకువస్తుంది, దాని వాస్తవికతను మరియు దానిని ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా స్పందిస్తామో ఆలోచించమని బలవంతం చేస్తుంది. పౌలు యొక్క సమాధానం ఈనాటికీ మనకు ఉపదేశిస్తుంది. తన మనస్సు తనకు జరిగిన అన్యాయముపై ఉండనివ్వలేదు. బదులుగా, దేవుడు తాను కోరుకున్న చోటనే తాను ఉన్నాడని నమ్ముతూ, వృద్ధాప్య అపొస్తలుడు తన దృష్టిని ఇతరులపై, ప్రత్యేకంగా సంఘము వైపు మరియు అతని యువ పాలితుడైన తిమోతి వైపు త్రిప్పాడు.

మీరు మీ దినముల అంతము వచ్చే సమయానికి మీ ఆలోచనలు ఎక్కడ తారాడుతున్నాయని మీరు ఆశించుచున్నారు?