ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
ప్రకటన యొక్క రచయిత తన పేరు యోహాను అని పుస్తకంలో నాలుగుసార్లు ప్రస్తావించాడు (ప్రకటన 1:1, 4, 9; 22:8). ఆసియలో సువార్త ప్రకటించినందుకు అధికారులు పత్మాసు ద్వీపానికి బహిష్కరించబడిన అపొస్తలుడైన యోహాను పుస్తక రచయిత యొక్క గుర్తింపుకు చరిత్ర అంతటా క్రైస్తవులు దాదాపు ఏకగ్రీవంగా ధృవీకరించారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం రోమీయులు యోహానును మరిగే నూనెలో పడవేసినట్లు చెప్తారు, కాని అపొస్తలుడు చనిపోనప్పుడు, వారు అతనిని పత్మాసు బంజరు రాయికి బహిష్కరించారు.
పుస్తకం యొక్క శీర్షికయైన ప్రకటన, అపోకలిప్స్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. తెలియని దాన్ని తెలియజేయటం లేదా వెల్లడిచేయటం గురించి యిది సూచిస్తుంది. భవిష్యత్ సంఘటనలను తెలియచేయటానికి చాలా ఆసక్తి ఉన్న ఈ పుస్తకానికి ఈ శీర్షిక ఖచ్చితంగా సరిపోతుంది.
మనమెక్కడ ఉన్నాము?
అపొస్తలుడైన యోహాను క్రీస్తుశకం 95 సంవత్సరంలో పత్మాసు ద్వీపంలో తన పరవాసం నుండి ప్రకటన పుస్తకం రాశాడు. అతను తన కార్యమును ఏడు ఆసియ సంఘములకు ప్రసంగించాడు-ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ మరియు లవొదికయ. యోహాను తన తరువాతి సంవత్సరాల్లో ఎఫెసులో పనిచేసినందున, ఈ దర్శనమును తన తక్షణ సంరక్షణ మరియు ప్రభావంలోనున్న సంఘములకు తెలియజేయడం సహజం. దేవునినుండి యోహాను భవిష్యత్తు గురించి అందుకున్న వివరణను ప్రవేశపెట్టడానికి ముందు ఆ ఏడు సంఘాలలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకంగా సందేశం ఇవ్వబడింది (2 మరియు 3 అధ్యాయాలు).
ప్రకటన ఎందుకంత ముఖ్యమైనది?
ప్రకటన గ్రంథము శ్రమలకాలంలోని సంఘటనల యొక్క స్పష్టమైన బైబిల్ వర్ణనను అందించి, ఆ భయంకరమైన సమయం యొక్క ప్రత్యేకతలతో వ్యవహరిస్తుంది (అధ్యాయాలు 4–18). మహాశ్రమకాలం తీర్పు జరిగే సమయం. సంఘము ఎత్తబడిన తర్వాత భూమిపై మిగిలిపోయిన వారు తమ అవిశ్వాసం కొరకు తీవ్రంగా బాధపడతారు. యోహాను ఈ తీర్పును ఇరవై ఒక్క సంఘటనల శ్రేణిగా చిత్రీకరించాడు-ఏడు ముద్రలను విప్పడం, ఏడు బూరలు ఊదడం, మరియు ఏడు పాత్రలను కుమ్మరించడం. మానవాళి యొక్క పాపపుతనంపై ఈ గొప్ప తీర్పు దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా యెంచుతాడో తెలియజేస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కప్పబడని వారి నుండి జీతము సరిచేయబడుతుంది.
ప్రకటన యొక్క ఉద్దేశమేమిటి?
ప్రకటన గ్రంథము శ్రమపై అనేక వివరాలను అందిస్తుంది-అవి తరచూ సాదృశ్యకరమైన భాష యొక్క రహస్యంలో ఉన్నప్పటికీ- చివరి నాలుగు అధ్యాయాలే పుస్తకం యొక్క మొత్తం సందేశాన్ని నిర్దేశిస్తాయి. ప్రకటన 19-22 చెడు శక్తులపై క్రీస్తు భవిష్యత్ విజయాన్ని మరియు విమోచన పొందినవారి కోసం ప్రపంచాన్ని తిరిగి సృష్టించడాన్ని చిత్రీకరించాయి. అంతిమంగా, పుస్తకం- మరియు ప్రపంచం- సత్యం కొరకు మరియు మంచితనం కొరకు మరియు అందం కొరకు తుది విజయంతో ముగుస్తాయి.
దాని అరవై ఆరు పుస్తకాలలో ఎక్కువ భాగం, బాధ యొక్క యాతనల్లో మునిగిన ప్రపంచాన్ని పరిశుద్ధ గ్రంథం చిత్రీకరిస్తుంది. ఆదికాండము 3 లోని పతనం నుండి మానవులకు పాపంతో సమస్య ఉంది, మరియు వాక్యం తరువాత వాక్యం మన సమస్యను ఎంతో శ్రమతో వివరంగా నమోదు చేసింది. ప్రకటన యొక్క వెలుగు ఈ సమస్యకు తుది సమాధానం ఇస్తుంది. యేసు ఒక్కసారియే పాపం చేసిన గాయాలను నయం చేస్తాడు (ప్రకటన 19), భూమిపై వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు (ప్రకటన 20), ఆపై తిరిగి దేవుని అసలు రూపకల్పనను సూచించే ప్రదేశంగా లోకాన్ని తిరిగి సృష్టిస్తాడు (ప్రకటన 21–22). పరిశుద్ధ గ్రంథం యొక్క కథనం సరళమైనది: సృష్టి, పతనం, పునఃసృష్టి. ప్రకటనలో నమోదు చేయబడిన యేసు యొక్క విమోచన కార్యము పూర్తి కాకుండా, మనకు కథ యొక్క ముగింపు ఉండదు, అప్పుడు భవిష్యత్తు కొరకు మన నిరీక్షణను తీవ్రమైన సందేహంలోనికి నెట్టివేస్తుంది.
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
సాధారణంగా ప్రజలు ప్రకటన పుస్తకాన్ని ప్రస్తావించినప్పుడు, వారు వెంటనే తీర్పు గురించి ఆలోచిస్తారు. నిస్సందేహముగా పుస్తకంలో ఎక్కువగా తీర్పు కనబడుతుంది. అయితే, ప్రకటన గ్రంథము తీర్పుతో ముగియదు. బదులుగా, ఇది మొత్తం పరిశుద్ధ గ్రంథమునకు అద్భుతమైన ఆరంభమును మరియు ముగింపును అందిస్తుంది, అదేమిటంటే ఇది పరదైసులో ఆరంభమై పరదైసులో ముగుస్తుంది. దుర్మార్గులపై తీర్పు కంటే, ప్రకటన గ్రంథం క్రీస్తునందు విశ్వాసముంచినవారి యొక్క నిరీక్షణను గురించిన ఒక పుస్తకం.
మీరు ఏ బాధలను లేక అవమానములను ఎదుర్కొన్నారు? మీరు ఏ విరిగిన సంబంధం గురించి విలపించారు? మరణం యొక్క కత్తి మీ హృదయంలోకి లోతుగా తగిలిందా? వేదనయైనను ఏడ్పైనను మరణమైనను లేని లోకాన్ని ప్రకటన గ్రంథం వాగ్దానం చేస్తుంది. ఈ జీవితంలోని క్షణమాత్రముండు శ్రమలు మరియు పోరాటాలను మించిన నిరీక్షణ నిజంగా ఉందని ప్రకటన గ్రంథము మనకు గుర్తు చేస్తుంది. ఒక రోజు చీకటి గతించిపోతుంది, మనమందరం శాశ్వతమైన వెలుగులో నివసిస్తాము.
ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము! దేవుడు స్తుతింపబడునుగాక.