రెండవ యోహాను

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ పత్రికలో యోహాను తనను తాను పేరు ద్వారా గుర్తించుకోలేదు, కాని అతను “పెద్ద” అనే పదాన్ని తనకోసం ఎన్నుకున్నాడు (2 యోహాను 1:1). పెద్దయైన యోహాను అనే వేరొక రచయిత ఈ పత్రిక రాశాడా (అలాగే 3 యోహానులో కూడా ఇదే విధంగా సంబోధించబడింది) లేదా అపొస్తలుడైన యోహానే తనకోసం వేరే శీర్షికను ఉపయోగించాడా అనే దానిపై కొంత చర్చ జరిగింది. ఏదేమైనా, రెండవ శతాబ్దం నుండి వచ్చిన తొలి సంఘ సాంప్రదాయం ఈ పత్రిక మరియు దాని సహచరుడైన 3 యోహాను కూడా ఒక మర్మమైన మరియు తెలియని పెద్దచేతగాక అపొస్తలుడిచే వ్రాయబడింది. వాస్తవానికి, “పెద్ద” అనే పదాన్ని తనకోసం ఉపయోగిస్తున్న అపొస్తలుడు మునుపెన్నడూ ఉపయోగించనిది కాదు-పేతురు తన మొదటి పత్రికలో (1 పేతురు 5:1) అదే పని చేశాడు.

మనమెక్కడ ఉన్నాము?

మనము 2 యోహాను అని పిలిచే ఈ చిన్న పత్రికలో యోహాను చాలా తక్కువ వివరాలు యిచ్చాడు. పత్రికలో యోహాను చర్చించిన పరిస్థితులలో ఏదీ కూడా 1 యోహాను పత్రిక పొందిన అదే సంఘములకు వెళ్ళలేదని ఆ కాలపు పాఠకుడిని ఆలోచింపజేయదు. అపొస్తలుడు “ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును” అని పత్రికను ఉద్దేశించి ప్రసంగించాడు, ఇది చాలా చర్చనీయాంశమైంది (2 యోహాను 1:1). ఇది అసలు స్త్రీని సూచిస్తుంది లేదా సంఘానికి సాదృశ్యముగా పనిచేస్తుంది. ఈ పత్రిక రక్తసంబంధంతో చేరిన చిన్న కుటుంబ సమూహానికైనా లేదా విశ్వాసము ద్వారా చేరిన పెద్ద గుంపుకైనా సరే, పత్రిక యొక్క ఉద్దేశంలో యెటువంటి మార్పు రాదు. 1 యోహానుకు ఈ పత్రిక యొక్క నేపథ్య సారూప్యతతో, క్రీ.శ. 90 లో యోహాను పత్మాసు నుండి వ్రాసినట్లు సూచించడం మంచిది.

రెండవ యోహాను ఎందుకంత ముఖ్యమైనది?

సత్యమునకు శత్రువుల విషయంలో మన స్థానం ఎలా ఉండాలో రెండవ యోహాను స్పష్టం చేస్తున్నది. 1 యోహాను దేవునితో మన సహవాసంపై దృష్టి పెడితే, 2 యోహాను అబద్ధాన్ని బోధించే వారి నుండి మన సహవాసాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెడుతుంది. తప్పుడు బోధకులను ఇంట్లోకి ఆహ్వానించటమేగాక వారికి శుభములు కూడా చెప్పకూడదని అపొస్తలుడు తన పాఠకులను హెచ్చరించేంత దూరం వెళ్ళాడు (2 యోహాను 1:10). ఇటువంటి క్రియలు విశ్వాసిని దుర్మార్గుడితో ఒకేకూటములో చేరుస్తాయి. విశ్వాసులను అబద్ధం మరియు తప్పుడు బోధ యొక్క మరకల నుండి పరిశుభ్రంగా ఉంచడానికి యోహాను ఆసక్తి చూపించాడు.

రెండవ యోహాను యొక్క ఉద్దేశమేమిటి?

యోహాను తన రెండవ పత్రికను "ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును" తన ప్రేమను ప్రకటిస్తూ, సత్యాన్ని ఎరిగినవారితో ఆ ప్రేమను పంచుకున్నాడు (2 యోహాను 1:1). తనకు వచ్చిన నివేదికల ప్రకారం, ఈ విశ్వాసులు క్రీస్తు బోధలను అనుసరిస్తున్నారని ఆయన అర్థం చేసుకున్నాడు. ఈ రకమైన జీవన విధానాన్ని "మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని" హెచ్చరించడం యేసు యొక్క గొప్ప ఆజ్ఞలకు స్పష్టమైన సూచన- దేవుణ్ణి ప్రేమించడం మరియు నీ పొరుగువారిని ప్రేమించడం (మత్తయి 22:36-40; యోహాను 13:34).

మరో మాటలో చెప్పాలంటే, సత్యంలో నడిచే వారు ఇతరులను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. కానీ వారు ఎవరిని ప్రేమిస్తున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్ళు మరియు తప్పుడు బోధకులు సంఘములోకి చొరబడ్డారు-యేసు యొక్క మానవ స్వరూపము గురించి అబద్ధాలు బోధించిన ప్రజలు, ఆయన నిజంగా మనిషి కాదని, మనిషివలె కనిపించాడని బోధించారు. డోసెటిజం అని పిలువబడే ఈ ప్రారంభ తప్పుడు బోధకు యోహాను నుండి సాధ్యమైనంత బలమైన ప్రతిస్పందన అవసరం. కాబట్టి ఈ తప్పుడు బోధకుల నుండి దూరముగా ఉండమని నిజమైన విశ్వాసులను అపొస్తలుడు హెచ్చరించాడు. గనుక మామూలుగా ప్రేమిస్తే సరిపోదు, సత్యం అనుమతించే పరిమితుల్లో ఇతరులను ప్రేమించాలని యోహాను ప్రోత్సహించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఒకరినొకరు ప్రేమించుకోవాలనే బలమైన ప్రోత్సాహాన్ని 2 యోహానులో విశ్వాసులకు యోహాను ఇచ్చాడు. అయితే, యోహాను ప్రేమను నిర్వచించకుండా వదిలిపెట్టలేదుగాని దానిని “ఆయన ఆజ్ఞలప్రకారము” నడచుటయేనని వర్ణించాడు (2 యోహాను 1:6). ఇది యోహాను సువార్తలో యేసు బోధను ప్రతిధ్వనిస్తుంది. అక్కడ ప్రభువు తన అనుచరులతో, “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు” (యోహాను 14:15) అని చెప్పారు.

మన ప్రేమ మన విధేయతమీద ఆధారపడి ఉంటుంది. మనము విధేయత చూపనప్పుడు, మనము ప్రేమించనట్లే. దేవునికి మన విధేయత మనల్ని మాత్రమే ప్రభావితం చేస్తుందనే థోరణిలో మనం ఉంటాము. కానీ అది నిజం కాదు. మన క్రియలు, విధేయతగలవైనా లేదా అవిధేయతగలవైనా, పరిస్థితి పట్ల మన స్వంత పరిమిత దృష్టికి మించి ప్రతిధ్వనిస్తాయి.

మీ స్వంత జీవితాన్ని పరిగణించండి. మీ విధేయత లేదా అవిధేయత మీ సన్నిహిత సంబంధాల్లో ఉన్నవారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? రెండవ యోహాను సత్యమునుండి దూరంగా పడిపోవడంవల్ల వచ్చే ప్రమాదాల గురించి మాత్రమే కాకుండా, మనకొరకు మరియు మనకు చాలా ముఖ్యమైన వారికొరకు మన జీవితాల్లో విధేయతకు ప్రాధాన్యతనివ్వాల్సిన ప్రాముఖ్యతను కూడా గుర్తుచేస్తుంది.