ఫిలిప్పీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పీ నగరంలో మూడు నెలలు గడిపి అక్కడ పరిచర్య చేశాడు. ఫిలిప్పీలోని పరిచర్య పౌలు మాసిదోనియలోకి ప్రవేశించటానికి గుర్తుగా ఉన్నది. త్రోయలో ఉన్నప్పుడు మాసిదోనియకు వెళ్లవలెనని పౌలుకు దర్శనం వచ్చింది. ఏజియన్ సముద్రం యొక్క ఈశాన్య మూలలో ఓడరేవు నగరమైన నెయపొలికిని, దాని సమీప పొరుగు పట్టణమైన ఫిలిప్పీకిని అవతల త్రోయ నగరం ఉన్నది (అపొస్తలుల కార్యములు 16:8–12).

ఫిలిప్పీలో ఈ మొదటి బసలో పౌలు ప్రజలను క్రీస్తునందు విశ్వాసములోనికి నడిపించాడు, వాళ్ళందరూ నగరంలో అభివృద్ధి చెందుతున్న సమాజానికి ప్రధానమైనవారు. తరువాత అతను తన మూడవ మిషనరీ ప్రయాణంలో కొంతకాలం ఈ నగరాన్ని సందర్శించాడు (20:6). వారిలో లూదియయను ఒక వ్యాపారస్తురాలు పౌలు మరియు అతని సహచరులకు తన యింటిని తెరచింది (16:13–15). అలాగే ఫిలిప్పీయుల చెరసాల నాయకుడు భూకంపం తరువాత అద్భుతంగా చెరసాల తెరచుకున్న తరువాత పౌలు పరిచర్యలో మారాడు (16:22-34).

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.శ. 61 లేదా 62 లో రోమా జైలు శిక్ష ముగిసే సమయానికి పౌలు నాలుగు జైలు పత్రికల్లో ఫిలిప్పీయులను చివరిగా వ్రాసాడు. పౌలు మిగతా మూడు జైలు పత్రికలను-ఎఫెసీయులు, కొలొస్సయులు మరియు ఫిలేమోనులను తుకికు చేతితో పంపించాడు, ఎందుకంటే వాటి గమ్యస్థానాలు ఒకదానికొకటి సమీపంలో ఉన్నాయి. అయితే, రోమాలో ఉన్న పౌలు యొద్దకు ఫిలిప్పీ సంఘము పంపిన ఆర్థికసాయంతో వెళ్ళిన ఎపఫ్రొదితుచేత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందించటం జరిగింది (ఫిలిప్పీయులకు 2:25; 4:18). రోమా‌లో ఉన్న సమయంలో, ఎపఫ్రొదితు అనారోగ్యానికి గురయ్యాడు, అందువల్ల అతను ఇంటికి తిరిగి రావడానికీ, పత్రికను పంపించడానికీ ఆలస్యం అయ్యింది (2:26-27).

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

అపొస్తలుడైన పౌలు గలతీయులను మరియు కొలొస్సయులను వ్రాసినట్లుగా సంక్షోభానికి ప్రతిస్పందనగా ఫిలిప్పీయులను వ్రాయలేదు. బదులుగా, అతను ఫిలిప్పీ విశ్వాసులపై తన ప్రశంసలను మరియు అభిమానాన్ని వ్యక్తపరచటానికి రాశాడు. ఇతర సంఘాలన్నిటికంటే, ఫిలిప్పీలోని విశ్వాసులు పౌలు యొక్క పరిచర్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు (2 కొరింథీయులకు 8:11; ఫిలిప్పీయులకు 4: 15-18). ఈ ప్రజల పట్ల పౌలుకు ఉన్న అభిమానం పత్రిక అంతటా స్పష్టంగా కనబడుతుంది, ఎందుకంటే వారు తమ విశ్వాసమునందు ఆనందమును ఐక్యతను కలిగి జీవించమని ప్రోత్సహించాడు (1:3–5, 25–26; 4:1).

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

ఫిలిప్పీయులు తరచూ ఉదాహరించు వాక్యభాగాలతో నిండిపోయింది: “మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీయులకు 1:6), “నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము” (1:21), మరియు “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” (4:13), ఇవి కొన్ని మాత్రమే. కానీ తగ్గింపు కలిగిన పరిచారకునిగా యేసుక్రీస్తు యొక్క వర్ణన ఈ పత్రికలోని పౌలు బోధలో ప్రధానమైనది (2:5–11).

ఫిలిప్పీ సంఘమును జ్ఞాపకము చేసికొనినప్పుడు పౌలు యొక్క ఆనందం ఈ పత్రికలో కాదనలేనిది, మరియు గ్రహీతలు కూడా ఇదే ఆనందం కలిగి ఉండాలని అతను కోరుకున్నాడు. ఫిలిప్పీయులను ఈ సత్యములోనికి నడిపించడానికి, పౌలు వారిని నేరుగా యేసు వద్దకు తీసుకువెళ్ళాడు. రక్షకుణ్ణి మాదిరిగా పెట్టుకుని పరస్పరం తగ్గింపు కలిగివుండుట ద్వారా మాత్రమే విశ్వాసుల సమాజంలో ఒకరితో ఒకరు సామరస్యం కలిగి జీవించగలుగుతారని వారికి బోధించాడు. క్రీస్తు నిమిత్తం తన ప్రాణమును పాణార్పణముగా పోసానని పౌలు వ్రాశాడు, ఇది క్రీస్తు సేవలో గొప్ప ఆనందం మరియు సంతృప్తిని పౌలు పొందుకొనులాగున నడిపించినది. ఫిలిప్పీయులకు ఆయన రాసిన లేఖ వారి జీవితాలను క్రీస్తుపై కేంద్రీకరించడం ద్వారా, వారు కూడా నిజమైన ఆనందంతో జీవించవచ్చని చూపించింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మనం కృతజ్ఞత చెల్లించటానికి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ, ఈ జీవన వేగం మరియు ఒత్తిడి తరచుగా మన నుండి ఆ ఆనందాన్ని అణచివేస్తున్నాయి. మన భుజాలు జారిపోయి మరియు మన తలలు వంగిపోయి, కొన్ని రోజులు లేదా నెలలు చాలా కష్టాలను చూస్తున్నాము. నిరాశతో, మనము తరచుగా అన్ని రకాల మార్గాల్లో ఆనందం కోసం వెదకుతాము-ఆస్తులను సంపాదించడం, ప్రదేశాలను సందర్శించడం లేదా ప్రజలను దర్శించటం. కానీ వీటిలో ఏదీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. కష్టమైన పరిస్థితుల మధ్య మీరు ఎక్కడ ఆనందాన్ని పొందుకుంటున్నారు?

ఫిలిప్పీయుల మాదిరిగానే పౌలుకు తెలిసినదేమంటే, నిజమైన ఆనందం యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యముపై తగ్గింపుగల విశ్వాసం ద్వారా, ఆయనను వెంబడించువారితో మనం చేరడం మరియు క్రీస్తు నామములో ఇతరులకు సేవ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది ఫిలిప్పీ విశ్వాసులు అనుభవించిన జీవితం, అలాగే ఈ రోజు మనకు ఈ జీవితం అందుబాటులో ఉన్నది.

పనికిరాని తగాదాలు మరియు విభజనల నుండి మిమ్మల్ని నిలువరించడానికి, వాటికి బదులుగా దేవుని ప్రజలతో సామరస్యపూర్వక సంబంధాలకు మార్గనిర్దేశం చేయడానికి క్రీస్తులో మీరు కనుగొన్న ఆనందాన్ని అనుమతించండి.