మత్తయి

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

మత్తయి తన సొంత పేరును “తన” సువార్తకు పెట్టుకోకపోయినా, ఆది సంఘము ఈ అపొస్తలుని పుస్తక రచనను ఏకగ్రీవముగా ధృవీకరించింది. క్రీ.శ. 140 లోనే, పాపియాస్ అనే క్రైస్తవుడు ప్రభువు పలికిన మాటలను మత్తయి హెబ్రీ భాషలో (బహుశా మత్తయి వాటిని ఎక్కువమంది ప్రేక్షకుల కోసం గ్రీకులోకి అనువదించడానికి ముందు) సంకలనం చేశాడని వ్రాసాడు.

పరిశుద్ధ గ్రంథము యొక్క పన్నెండు అపొస్తలుల యొక్క జాబితాలన్నిటిల్లోను మత్తయి పేరు కనిపిస్తుంది గాని మార్కు మరియు లూకా అతన్ని లేవి అని సంబోధించారు. పన్ను వసూలు చేసే అతని చరిత్ర అతన్ని ఇతర అపొస్తలుల నుండి ప్రత్యేకపరచింది. అలాగే, మత్తయి 9:9 లో అతను నమోదు చేసిన ఒక సంఘటన ప్రకారం యేసును వెంబడించుమని పిలుపు వచ్చిన వెంటనే మత్తయి తన ఇంటిలో యేసు కోసం ఒక విందును ఏర్పాటుచేసాడు. అందులో పాపిప్ఠులైన మత్తయి యొక్క స్నేహితులు ఆహ్వాన జాబితాలో ఉన్నారు. యేసు, అలాగే తాను సమాజంలోని పాపాత్మకమైన మరియు అణగారిన వారితో సహవాసం చేయటం ఏదో వింతగా మత్తయి భావించలేదు.

మనమెక్కడ ఉన్నాము?

నాలుగు సువార్తలలో మత్తయి ఎక్కువగా యూదుల కేంద్రీకృతమై ఉన్నది. ఇశ్రాయేలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయగా యేసు యొక్క గుర్తింపును వివరించే ప్రయత్నంలో అపొస్తలుడు పాత నిబంధన ప్రవక్తల రచనలను క్రమం తప్పకుండా పేర్కొన్నాడు.

అయితే, మత్తయి సువార్త ఎప్పుడు వ్రాయబడిందో చెప్పడం చాలా కష్టం. క్రీ.శ. 60-65 మధ్య తేదీకి సానుకూలంగా అనేక అంశాలు చెప్పబడ్డాయి. మొదటిదేమంటే, క్రీ.శ. 70 లో జరిగిన ఆలయం యొక్క నాశనం గురించి ఈ పుస్తకం ప్రస్తావించలేదు. ముఖ్యంగా యూదా మతం ద్వారా స్పష్టంగా ప్రభావితమైన పుస్తకంలో ఇటువంటి విపత్కర సంఘటన గురించి కొంత వ్యాఖ్యానము జరిగివుండేది. క్రైస్తవుల చేత సువార్త ప్రకటన చాలావరకు యూదుల మీద ఎక్కువగా నిర్దేశించబడిన సమయంలో ఇది వ్రాయబడిందని ఎక్కువగా యూదా ఆనవాలు కలిగియున్న ఈ పుస్తకం సూచిస్తుంది. ఈ విధముగా సువార్త ప్రకటన యూదుల మీద కేంద్రీకృతమవటం దశాబ్దాలు గడిచేకొద్దీ తగ్గిపోతూ సాధారణ స్థితికి వచ్చేసింది. చివరగా, చాలా మంది పండితులు మార్కు మొట్టమొదటి సువార్తగా వ్రాయబడినదని, దాని తర్వాత వెంటనే మత్తయి సువార్త వ్రాయబడినదని నమ్ముచున్నారు.

మత్తయి ఎందుకంత ముఖ్యమైనది?

అపొస్తలుడైన మత్తయి అనే యూదుడు యేసు పరిచర్యను స్పష్టముగా యూదు దృక్పథముతో అందించాడు. అతను పాత నిబంధన నుండి యాభైకి పైగా ప్రత్యక్ష అనులేఖనాలను, ఇంకా ఎక్కువ పరోక్ష సూచనలను చేర్చాడు. ఈ విషయంలో ఇది ఇతర సువార్తలన్నిటిని మించిపోయింది. అలాగే మత్తయి ఈ సువార్తను వ్రాయడానికి పూనుకొన్నప్పుడు యూదు జనాభాను దృష్టిలో పెట్టుకున్నట్లు ఇది సూచిస్తుంది. యేసు మరియు పాత నిబంధనల మధ్య మత్తయి యొక్క విస్తృతమైన సంబంధాలు యేసు పరిచర్యకు తగిన ప్రవచనాత్మక సాక్ష్యాలను అందిస్తాయి. అలాగే మొదటి శతాబ్దపు పాఠకులు క్రీస్తు కేంద్రీకృత మనస్సుతో పాత నిబంధనను ఎలా సమీపించారో సమకాలీన పాఠకులకు ఈ సువార్త ఒక సంగ్రహావలోకనమును ఇస్తుంది.

అదనంగా, మత్తయి సువార్త ప్రతి యూదు పాఠకుడి మనస్సులోని ప్రశ్నకు సమాధానమిస్తుంది: “యేసు యూదుల రాజు అయితే, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం ఎక్కడ ఉంది?” దేవుని రాజ్యాన్ని ఇశ్రాయేలుకు యేసు ఇచ్చాడని మత్తయి వెల్లడించాడు, కాని ఆ ప్రతిపాదన తిరస్కరించబడింది (మత్తయి 4:17; 16:13–28; 21:42–43). లోకంలో దేవుని ప్రాథమిక పని ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘమును నిర్మించడం ద్వారా సాధించబడింది. దీని తర్వాత యేసు తిరిగి భూమి మీదికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి ఇశ్రాయేలు నుండి లోకమును ఏలును.

మత్తయి యొక్క ఉద్దేశమేమిటి?

ఇశ్రాయేలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ మరియు రాజు యేసేనని చూపించడానికి మత్తయి యేసు పరిచర్య గురించి తన వృత్తాంతమును రాశాడు. “అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి” (మత్తయి 1:1) అని తన ప్రారంభ వాక్యంలో అతను ఈ విషయాన్ని ప్రతిబింబించాడు. అక్కడి నుండి, మత్తయి తన పాఠకులను పాత నిబంధనకు తిరిగి తీసుకువెళ్ళి, యేసు పుట్టిన ప్రదేశానికి సంబంధించి పాత నిబంధన సాక్ష్యాలను, యేసు జన్మించిన ప్రదేశంగా బేత్లెహేమును, ఐగుప్తుకు పారిపోవటాన్ని, శిశువులను హేరోదు చంపడాన్ని మరియు యేసు పరిచర్య ఆరంభమును గురించి సాక్ష్యమిచ్చాడు. యూదు సమాజంలో చాలామంది మెస్సీయ యొక్క పాత్ర తమదేనని వాదించి చెప్పుకున్న ప్రపంచంలో, పాత నిబంధనలో యేసు జీవితాన్ని స్థాపించడంలో మత్తయి యొక్క నిబద్ధత యేసును ఈ తప్పుడు మెస్సీయాల సమూహానికి భిన్నంగా ఎంతో ఉన్నతస్థాయిలో నిలబెట్టాడు. అపొస్తలుడు మన ప్రభువు యొక్క చిత్తరువును చిత్రించాడు, అది ఈ భూమిమీద నడచిన వారందరి మధ్య ఎప్పటికీ ప్రత్యేకతను కలిగివుంటుంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

నాలుగు వందల సంవత్సరాల ప్రవచనాత్మక నిశ్శబ్దాన్ని భరించిన తరువాత, దేవుడు వారిని విడిచిపెట్టాడా లేదా అని దేవుని ప్రజలు ఆలోచిస్తూ ఉండి ఉండాలి. దేవుని నుండి శతాబ్దాలుగా క్రమం తప్పకుండా సంభాషణలు జరిగిన తరువాత, ప్రజలు నిజమైన ప్రవక్త లేదా దేవుని ప్రతినిధి లేకుండా తమను తాము చూచుకున్నారు. అయితే, యోహాను మరియు యేసు పరిచర్యలు దేవుని ప్రజలను దేవుడు మరచిపోలేదని గుర్తుచేస్తున్నాయి. ఆ కాలంలో దేవుని నిశ్శబ్దం ఆయన విమోచన ప్రణాళిక యొక్క సీలను లాగడానికి పూర్వగామి మాత్రమే. దేవుడు మరచిపోలేదు - ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. మత్తయి ఆ విషయాన్ని స్పష్టం చేశాడు.

ఇది అప్పుడూ నిజమే, అలాగే ఇది ఈ రోజూ ఖచ్చితంగా నిజమే. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టినట్లు లేదా మీ విజ్ఞాపనముల నేపథ్యంలో ఆయన మౌనంగా ఉన్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మనము మత్తయి సువార్త చదివినప్పుడు, యేసుక్రీస్తు ఇశ్రాయేలు యొక్క రాజు మరియు మెస్సీయగా బయలుపరచబడటం మనం చూడడమే కాదు, దేవుడే మానవశరీరముగా ఆయన భూమిపైకి రావడం మన పట్ల ఆయనకున్న లోతైన ప్రేమను గుర్తు చేస్తుంది. ఇప్పుడు పునరుత్థానుడై ఆరోహణుడైన ప్రభువైన యేసు ఎల్లప్పుడూ యుగసమాప్తి వరకు సదాకాలము మనతో కూడ ఉంటాడు (మత్తయి 28:20).

క్రీస్తు తన అనుచరులకు ఆజ్ఞాపించినది నేటికీ అది మనకు ఆయన ఆదేశమే: “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” (మత్తయి 28:19). మనలో ప్రతి ఒక్కరి ద్వారా ఆయన పని చేస్తూ ఆయన సంఘమును నిర్మించటమే క్రీస్తు యొక్క పని.