లూకా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఈ సువార్తలో లూకా పేరు ఎప్పుడూ కనిపించనప్పటికీ, ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం ఈ పుస్తకాన్ని ఆయనకు ఏకగ్రీవంగా ఆపాదించింది. సువార్తను పరిచయం చేయడానికి వ్రాసిన ఒక పురాతన ఉపోద్ఘాతం లూకాను అంతియొకయకు చెందిన ఒక సిరియనుడని వర్ణించింది. ఈ సమాచారంతో, లూకా బహుశా యూదుడు కాదని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. కొలొస్సయులకు తన శుభములను తెలియజేస్తూ పౌలు అతన్ని ఇతర అన్యజనుల జాబితాలో వేశాడు (4:14). పురాతన ఉపోద్ఘాతం ప్రకారం, లూకా చివరికి గ్రీకు నగరమైన తేబేసులో స్థిరపడ్డాడు, అక్కడ అతను 84 సంవత్సరాల వయస్సులో మరణించాడు.1

తన సువార్త గురించి లూకా యొక్క స్వంత ఉపోద్ఘాతం, క్రీస్తు జీవిత సంఘటనలను కాలక్రమానుసారం జాగ్రత్తగా అందించే ఉద్దేశ్యంతో లూకా ఈ లేఖను రచించాడని సూచిస్తుంది. వైద్యునిగా, లూకా జాగ్రత్తగల పరిశీలకుడిగా శిక్షణ పొంది ఉంటాడు, ఈ పనిలో ఆ స్వభావము చాలా అమూల్యమైనదిగా ఉన్నది. దీని ఫలితమే థెయొఫిలా‌కు రాసిన రెండు-సంపుటముల యొక్క రచనలోని మొదటి భాగం. తరువాతి సంపుటమును అపొస్తలుల కార్యములుగా మనకు తెలుసు.

మనమెక్కడ ఉన్నాము?

లూకా సువార్త వ్రాయబడిన తేదీ చాలావరకు అపొస్తలుల కార్యముల యొక్క తేదీ మీద ఆధారపడి ఉంటుంది. పౌలు మరణానికి ముందు (క్రీ.శ. 68) మరియు నీరో (క్రీ.శ. 64) క్రింద క్రైస్తవుల హింస మొదలయ్యే ముందు, రోమా‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న పౌలుతో లూకా రెండవ సంపుటము ఆగినది. అపొస్తలుల కార్యములు ముందు లూకా సువార్త పూర్తయిందనటానికి ఇది కారణం. అయితే ఎప్పుడు?

యెరూషలేముకు అపొస్తలుని చివరి సందర్శనలో లూకా పౌలుతో కలిసి వచ్చాడని అపొస్తలుల కార్యములు 21:17 చెబుతుంది, ఇది క్రీ.శ. 57–58లో జరిగింది. చివరికి, యూదులు పౌలును దేవాలయంలో నిర్బంధించారు. కైసరయలో రెండేళ్ల కఠిన పరీక్షతో పౌలు యొక్క జైలు శిక్ష ముగిసింది. ప్రాథమిక వనరుల నుండి సువార్త రాయడానికి అవసరమైన సమాచారాన్ని, అనగా యేసు పరిచర్యను, మరణమును మరియు పునరుత్థాన దర్శనములను చూసిన వ్యక్తుల నుండి సేకరించడం ప్రారంభించడానికి లూకా పౌలుతో లేని ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాడు. సమాచారం సేకరించిన వెంటనే లూకా తన సువార్తను వ్రాయడం ఆరంభించివుంటే, పౌలు రోమా జైలుకు బదిలీ అయిన తరువాత క్రీ.శ. 60 లో ఇది పూర్తయ్యి ఉంటుంది.

లూకా ఎందుకంత ముఖ్యమైనది?

ప్రజలపై లూకాకు ఉన్న ఆసక్తి కాదనలేనిది. లూకా సువార్తకు ప్రత్యేకమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో వ్యక్తులతో యేసు యొక్క ప్రతిస్పందనలు కనబడుచున్నవి. ఈ వ్యక్తుల్లో చాలామంది “ఆమోదయోగ్యమైన” సమాజం యొక్క అంచులలో నివసిస్తున్న పాపులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. మత్తయి మరియు మార్కు మాదిరిగానే, యేసు పాదాలకు అత్తరు పూయడానికి వచ్చిన ఒక మహిళ సంఘటనను లూకా నమోదు చేశాడు. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అక్కడ అందరికీ తెలిసిన వాస్తవాన్ని ఎత్తి చూపిన ఏకైక సువార్త రచయిత లూకా (లూకా 7:37). అదేవిధంగా, యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగల మధ్య సంభాషణను లూకాలో మాత్రమే మనం కనుగొంటాము, వారిలో ఒకడు యేసును సమర్థించి పరదైసు యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. లూకా యొక్క వర్ణన ప్రకారం మన ప్రభువులో ఒక వ్యక్తి పరిచర్య చేయుటకు వచ్చి జీవితంలో తమ స్థితి ఎలా ఉన్నను ప్రజలందరికీ కనికరము చూపించిన యేసును బయలుపరచింది.

లూకా యొక్క ఉద్దేశమేమిటి?

మత్తయి యేసును రాజుగా చిత్రీకరించినట్లు, మార్కు ఆయనను పరిచారకునిగా చూపించినట్లు, లూకా యేసును మనుష్యకుమారునిగా ఒక ప్రత్యేకమైన దృక్పథములో కనబరిచాడు. “మనుష్యకుమారుడు” అనే ఈ మాట తనను తాను సూచించుకోవడానికి యేసుకు ప్రియమైన విధము.

లూకా సువార్తకు ప్రత్యేకమైన వ్యక్తులలో చాలా ప్రసిద్ధి చెందినదివాడు సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. జనులు గుంపుకూడి యుండుట వలన పొట్టివాడైన ఈ వ్యక్తి, యేసు తన పట్టణానికి చేరుకుంటున్నప్పుడు ఆయనను చూడటానికి చెట్టు ఎక్కవలసి వచ్చింది. జక్కయ్యతో కలిసి యేసు అతని ఇంట్లో భోజనం చేసాడు. ఇది స్థానిక మత పెద్దల యొక్క అసహ్యతకు దారితీసింది. జక్కయ్య తన పూర్వపు జీవన విధానంపై విచారం వ్యక్తం చేసి, నష్టపరిహారం చెల్లిస్తానని ప్రమాణం చేసినప్పుడు, యేసు యొక్క స్పందన లూకా సువార్త యొక్క ఇతివృత్తంగా మారింది: “నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను” (లూకా 19:10). యూదులకు మరియు అన్యజనులందరికీ రక్షణ అనుగ్రహించు దేవుని ఆదర్శ మనిషిగా లూకా యేసును చిత్రీకరించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యేసును గూర్చిన లూకా వర్ణన యొక్క గొప్పతనం ఈ రోజు దేవునితో మన సంబంధము తీవ్ర ప్రభావాలను కలిగి ఉంది. యేసు లూకా సువార్త గుండా నడుస్తూ, ప్రజలు చేసినవాటితోగాని లేదా సమాజంలో వారి స్థితిగతులతోగాని సంబంధం లేకుండా వారి పట్ల ఆయనకున్న లోతైన మరియు స్థిరమైన సంరక్షణను వివరిస్తుంది.

మీరు ఏమి చేసినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? దేవుని శాశ్వతమైన కుమారుడు దిగివచ్చి తనను తాను తగ్గించుకోవటం, మానవ శరీరాన్ని దాల్చడం, తనను తాను మానవ పరిమితులకు లోబడేటట్లు చేసుకోవటం, మరియు తన ప్రజలను శారీరక రూపంలో వెతకడం ద్వారా దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మరియు మనం ఇతరులను ఎంత శ్రద్ధగా చూసుకోవాలో స్పష్టంగా చూపిస్తుంది.

  1. Helmut Koester, Ancient Christian Gospels: Their History and Development (Harrisburg, Pa.: Trinity Press International, 1990), 335. (Accessed on Google Books, March 25, 2010.)