యూదా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

ఇతర సాధారణ ఉపదేశాల మాదిరిగానే, ఈ చిన్న పుస్తకం యొక్క శీర్షిక దాని రచయిత నుండి ఈ పేరును తీసుకుంది. చాలామంది పండితులు రచయితను కనీసం రెండు కారణాల వల్ల యేసు యొక్క సహోదరుడైన యూదాగా గుర్తించారు. మొదటి కారణమేమంటే, అతను తనను తాను “యాకోబు సోదరుడు” (యూదా 1:1) గా గుర్తించుకున్నాడు, అనగా అతను బహుశా “యాకోబు కుమారుడు” (లూకా 6:16 లో ఆంగ్ల భాషలోని బైబిల్లో) అని పిలువబడ్డ యూదా అనే అపొస్తలుడు కాదు. యూదా పుస్తక రచయిత తనను తాను యాకోబు సహోదరుడిగా గుర్తించాడు గనుక అతన్ని యేసు కుటుంబంతో కలిపే అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం యాకోబు గురించి పేజీలోని “ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు” చూడండి.) రెండవది ఏమిటంటే, మత్తయి 13:55 యేసు సోదరుల పేర్లను యాకోబు మరియు యూదా అని నమోదు చేస్తుంది. సువార్తలు అతని పేరును జూడాస్ (ఆంగ్లంలో) అని నమోదు చేయగా, ఆంగ్ల అనువాదాలు దీనిని జూడ్ (ఆంగ్లంలో ఈ పత్రిక పేరు) అని కుదించాయి. ఎందుకంటే యేసును మోసం చేసిన శిష్యుడైన యూదా ఇస్కరియోతు, ఆంగ్లములో జూడాస్ ఇస్కారియోట్‌తో ఉన్న సంబంధం కారణంగా, బహుశా ఈ రోజున ఎవరూ పిల్లలకి జూడాస్ (ఆంగ్లంలో) అని పేరు పెట్టడానికి ఇష్టపడరు.

తన అన్నయైన యాకోబు మాదిరిగా, యూదా ప్రభువు జీవించి ఉన్నప్పుడు యేసుపై నమ్మకం ఉంచలేదు. సిలువ వేయబడటం మరియు పునరుత్థానం తరువాత మాత్రమే యూదా కళ్ళ నుండి పొరలు రాలిపోయాయి. తరువాత అతను తన సోదరుడైన యేసు అనుచరుడయ్యాడు. మొదటి కొరింథీయులకు 9:5 ఒక అద్భుతమైన సమాచారాన్ని అందిస్తుంది. అదేమంటే ప్రభువుయొక్క సహోదరులు మరియు వారి భార్యలు మిషనరీ ప్రయాణాలు చేశారని పేర్కొంది. ఈ కొంచెం వర్ణన నుండి, మనము యూదాను కొంతకాలం సందేహాలతో నివసించిన వ్యక్తిగా చిత్రీకరించడం మొదలుపెట్టాము, కాని చివరికి యేసునందు బలమైన విశ్వాసములోనికి వచ్చాడు. మరియు అతను సువార్త పక్షమున ప్రయాణిస్తున్నప్పుడు-యూదా ఇస్కరియోతు యొక్క పేరుకు వ్యతిరేకంగా యూదా అనే పేరుతో ఒక నగరం తర్వాత యింకొక నగరంలో కథను చెప్పడం ద్వారా ద్రోహికి పూర్తి విరుద్ధంగా, అతను విశ్వాసానికి సజీవ ఉదాహరణగా నిలిచాడు.

మనమెక్కడ ఉన్నాము?

యూదా పుస్తకం యొక్క తేదీ తెలుసుకోవడం చాలా కష్టం. ప్రధానంగా పరిశుద్ధ గ్రంథం మరియు సాంప్రదాయం దాని రచయిత యొక్క వ్యక్తిగత వివరాల గురించి చాలా తక్కువగా వెల్లడించాయి. అయితే ఈ పుస్తకం ఏదైనా ప్రత్యేకమైన వ్యక్తులు లేదా ప్రదేశాల పేర్లను ప్రస్తావించలేదు. ప్రస్తుత పాఠకులకు అందుబాటులో ఉన్న ఒక గుర్తు ఏమిటంటే, యూదా మరియు 2 పేతురు పుస్తకాల మధ్య అద్భుతమైన సారూప్యత. పేతురు తన పత్రికను మొదట వ్రాశాడు (క్రీ.శ. 64-66), యూదా తన పత్రికను క్రీ.శ. 67 మరియు 80 మధ్యకాలంలో రాశాడు.

యూదా ఎందుకంత ముఖ్యమైనది?

తప్పుడు బోధకులను ఖండించడం మరియు సంఘము నుండి అటువంటి వారిని తొలగించడం అవసరం అనే అతని భావన యొక్క ఆవశ్యకతను యూదా యొక్క ధృడమైన సంక్షిప్తత తెలియజేస్తుంది. ఈ విషయం గూర్చి చెప్పడానికి యూదా పెక్కు మాటలతో పుస్తకాన్ని వృథా చేయకుండా చాలా తక్కువ పదాలను ఉపయోగించాడు. అధికారాన్ని తిరస్కరించడం మరియు తమ్మును తాము మెప్పించుకోవాలనుకోవటం వంటి ఖండించడానికి అర్హమైన ప్రజలను మరియు ఆచారాలను అతను సంఘములో చూశాడు. ఈ లోపాలకు ప్రతిస్పందనగా, యూదా చాలా బైబిల్ చిత్రాలను, అనగా కయీను తన తమ్ముడైన హేబేలును చంపడం, సొదొమ గొమొఱ్ఱాలను నింపివేసిన పాపపు ప్రజలకు శిక్ష వేయటం గూర్చిన విషయాలను (యూదా 1:7, 11) క్రమబద్ధంగా చెప్పి సంఘములో జరుగుచున్న వాటన్నిటి విషయమై తాను ఏమనుకుంటున్నాడో స్పష్టత ఇచ్చాడు.

యూదా యొక్క ఉద్దేశమేమిటి?

తన పత్రికలో యూదా యొక్క ఉద్దేశ్యం రెండు విధాలుగా ఉన్నది: అతను క్రైస్తవ సమాజంలోకి చొరబడిన తప్పుడు బోధకులను బహిర్గతం చేయాలనుకున్నాడు, మరియు క్రైస్తవులను విశ్వాసంలో గట్టిగా నిలబడటానికి మరియు సత్యం కోసం పోరాడటానికి ప్రోత్సహించాలనుకున్నాడు. తప్పుడు బోధకులు విశ్వాసులచే గుర్తించబడని తమ వస్తువులను బలవంతముగా రుద్దారని యూదా గుర్తించాడు. అందువల్ల అసమ్మతివాదులు ఎంత భయంకరమైనవారో స్పష్టంగా వివరించడం ద్వారా విశ్వాసుల అవగాహనను పెంచడానికి అతను పనిచేశాడు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసేవారికి వ్యతిరేకంగా విశ్వాసులు నిలబడటం చాలా ముఖ్యమని యూదా భావించాడు. విశ్వాసులు అపొస్తలుల బోధను జ్ఞాపకం చేసుకోవడం, ఒకరినొకరు విశ్వాసంలో నిర్మించుకోవడం, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం మరియు దేవుని ప్రేమలో తమ్మును తాము నిలబెట్టుకోవడం (యూదా 1:17, 20–21) చేయాలి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

సత్యం కోసం పోరాడండి! తప్పుకు వ్యతిరేకంగా నిలబడండి! యూదా యొక్క పుస్తకం ఉద్రేకపూరితమైన సారవంతమైన ప్రకటనలకు మంచి నిర్వచనం-దాని చిన్న ఆజ్ఞలు మరియు ప్రకటనలు మెషిన్-గన్ వలె పేజీ నుండి అకస్మాత్తుగా పేలుతున్నాయి. కానీ ఈ రోజు మరియు ఈ యుగంలో, ఉద్రేకపూరితమైన మాటలు మొరటుగా లేదా ఆమోదయోగ్యం కానివిగా మారిపోయాయి. అనేక వర్గాలకు యూదా యొక్క గంభీర స్వరము సహించదు. క్రైస్తవ విశ్వాసం యొక్క మృదువైన మరియు సున్నితమైన రూపాన్ని జనసమూహం ఇష్టపడతారు. కానీ సత్యాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్న వారి నుండి దూకుడుగా దాన్ని రక్షించడానికి ఒక సమయం మరియు స్థలం ఉందని యూదా మనకు గుర్తుచేస్తున్నాడు.

తప్పు నుండి సత్యాన్ని రక్షించడంలో మీరు ఎలా పాల్గొనగలరు?