హెబ్రీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క రచయిత పేరు రహస్యంగా దాచబడి ఉంది. సంఘ చరిత్ర ప్రారంభంలో కూడా, ఎంతో నేర్పరియైన ఆరిజెన్ అనే ఒక క్రైస్తవుడు హెబ్రీ పత్రిక యొక్క అసలైన రచయిత గురించి తన తెలియనితనాన్ని అంగీకరించాల్సి వచ్చింది. రచయిత యొక్క గుర్తింపుకు సంబంధించి అనేక సిద్ధాంతాలు సంవత్సరాలుగా ప్రతిపాదించబడ్డాయి, అయితే అవన్నీ ముఖ్యమైన సమస్యలను కలిగి ఉన్నాయి.

రోమా సామ్రాజ్యం యొక్క తూర్పు భాగంలోని చాలా సంఘాలు పౌలు ఈ పుస్తకాన్ని రచించాడని నమ్మాయి, ఆ ప్రాంతాలలోని సంఘాలు క్యాననులోకి దీన్ని చేర్చడానికి ముందుగానే అంగీకరించాయి. మొదటి శతాబ్దం చివర్లో కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో రోమీయుడైన క్లెమెంతు హెబ్రీ పత్రిక నుండి చాలా తీసుకున్నప్పటికీ, పాశ్చాత్య సంఘములో చాలామంది ఈ పుస్తకానికి మూలం పౌలు కాదనే అభిప్రాయముతో ఉన్నారు. లూకా, బర్నబా, అపొల్లోను మరియు క్లెమెంతు వంటి రచయితలు కూడా సాధ్యమైనవారుగా పరిగణించబడ్డారు. ఈ పుస్తకం యొక్క అవ్యక్త రచయిత మూలంగా దాని ప్రామాణికతపై మన విశ్వాసం కదలకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం యొక్క క్యాననుకు ముఖ్యమైన వేదాంతపరమైన తోడ్పాటు అందించింది. ఇది మొదటి శతాబ్దం చివరి నుండి పవిత్ర గ్రంథంగా వర్ణించబడింది. అందుకే క్రైస్తవులు రెండువేల సంవత్సరాలుగా హెబ్రీయుల పుస్తకం యొక్క దైవావేశమును మరియు ఆమోదముద్రను అవిరుద్ధముగా ఎత్తిపట్టుకొన్నారు.

మనమెక్కడ ఉన్నాము?

బలమైన యూదుల లక్షణం కలిగియున్న హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క కూర్పు తేదీని చాలావరకు క్రీ.శ. 64-69 మధ్యకు కుదించటానికి సహాయపడుతుంది. విశేషమేమిటంటే, క్రీ.శ. 70 లో యెరూషలేములోని దేవాలయం నాశనమైనట్లు ఈ పుస్తకం ప్రస్తావించలేదు మరియు అర్పణ వ్యవస్థ ఇంకనూ ఉనికిలో ఉన్నట్లుగానే రచయిత వ్రాసాడు (హెబ్రీయులు 10:1-2, 11). హెబ్రీ ఆచారాలు మరియు పాత నిబంధన గురించిన అనేక సూచనలు ఉండటంవలన, ఈ పుస్తకం బహుశా రోమాలోనున్న యూదు క్రైస్తవ సమాజానికి పంపబడింది.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

విశ్వాసి జీవితంలో క్రీస్తు ప్రస్తుత యాజక పరిచర్యను హెబ్రీ పత్రిక స్పష్టంగా తెలుపుచున్నది. యేసు దేవుని దైవ కుమారుడు మరియు సంపూర్ణమైన మానవుడు, మరియు మానవులు ప్రార్థన ద్వారా పరలోకంలో తండ్రిని సంప్రదించడానికి ఆయన యాజక పాత్రలో మార్గాన్ని సరాళం చేసాడు (హెబ్రీయులు 4:14-16). యేసు యొక్క యాజకత్వం పాత నిబంధనలోని అహరోను దాని కంటే గొప్పది, ఎందుకంటే యేసు ద్వారా మాత్రమే మనకు శాశ్వతమైన రక్షణ లభిస్తుంది (5:1–9). ఇంకా, యేసు నిరంతర మరియు సంపూర్ణమైన ప్రధానయాజకుడయ్యాడు, మానవుల పాపాల తరఫున తనను తాను పాపరహితమైన బలిగా అర్పించుకోవడం ద్వారా మిగతా యాజకులందరినీ మించిపోయాడు (7:24–26; 9:28).

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

యేసుక్రీస్తు మిగతా ప్రజలందరినీ, అన్వేషణలను, వస్తువులను లేదా మానవులు విధేయత చూపే ఆశలను మించిపోయాడని దాని పేజీలలో హెబ్రీ పత్రిక స్పష్టం చేస్తున్నది. యేసు దేవదూతలకంటే శ్రేష్ఠమైనవాడని, రక్షణ ద్వారా మానవాళికి మంచి జీవితాలను తీసుకువచ్చినట్లుగా, మోషే ధర్మశాస్త్రం వాగ్దానం చేసిన దానికంటే శ్రేష్ఠమైన నిరీక్షణను అందించినట్లుగా, ఎద్దు లేదా మేక కంటే మన పాపాలకు శ్రేష్ఠమైన బలిగా మరియు ఆయనయందు విశ్వాసముంచేవారికి పరలోకంలో శ్రేష్ఠమైన స్వాస్థ్యమును అందించినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక వర్ణించింది (హెబ్రీయులకు 1:4; 6:9; 7:19; 9:23; 10:34). యేసు వాస్తవముగా ఇతరులకన్నా గొప్పవాడు.

నీరో యొక్క హింసతో పోరాడుతున్న మరియు మోషే ధర్మశాస్త్రం వైపు తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్న రోమా‌లోని యూదు క్రైస్తవులకు యేసు యొక్క ఆధిపత్యము యొక్క సందేశం చాలా ముఖ్యమైనది. వారు బాధలను ఎదుర్కొన్నప్పటికీ, వారు నిజంగా మంచి మార్గాన్ని అనుసరిస్తున్నారు. . . అలాగే వారు ఓర్పుతో ఉండాలని హెబ్రీ పత్రిక యొక్క రచయిత ఈ యూదు క్రైస్తవ విశ్వాసులకు చూపించాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

పూర్వీకులు చెక్క మరియు రాతితో తయారు చేసిన విగ్రహాలను సృష్టించారు. ఆధునిక సమాజం ఆ రకమైన విగ్రహాన్ని పక్కన పెట్టి దానికి ప్రతిగా తనకనుకూలమైన క్రొత్త విగ్రహాలను పెట్టుకుంది - వినోదకరమైన యంత్రపరికరాలు, భౌతిక సంపద, సౌకర్యవంతమైన జీవనశైలి మరియు మన పిల్లలు కూడా మనకి విగ్రహాలు అయిపోయారు. విగ్రహారాధన యొక్క అపరిమితమైన ఐశ్వర్యమును మానవులు చూచి అనుభవించారు. ఇక్కడ మనం సృష్టించిన వస్తువును లేదా వ్యక్తిని ఒకేఒక్క నిజమైన దేవుని స్థానంలో ఉంచుతున్నాము. మీ జీవితంలో మీరు ఏ విగ్రహాలను కలిగి ఉన్నారు?

మన జీవితంలో ప్రధానమైన స్థానాన్ని పొందటానికి ఒకేఒక్క వ్యక్తి మాత్రమే అర్హుడని హెబ్రీయులకు రాసిన పత్రిక స్పష్టం చేస్తుంది. వ్యాపారసంస్థ నిచ్చెనపై ఎదగడమే దైవసమానముగా పూజించడం లేదా మన ఆశలన్నింటినీ మన పిల్లల మీదనే పెట్టుకోవడంలో మనము తీరికలేక ఉన్నప్పుడు, యేసు మనకు శ్రేష్ఠమైన స్థానం, శ్రేష్ఠమైన యాజకుడు, శ్రేష్ఠమైన నిబంధన, శ్రేష్ఠమైన నిరీక్షణ మరియు శ్రేష్ఠమైన బలి అనుగ్రహిస్తున్నాడు.

మన జీవితాల్లో యేసుకు ఇవ్వవలసిన సరైన స్థానమును ఆయనకు మనం ఇచ్చినప్పుడు మాత్రమే జీవితంలో మిగతావన్నీ దేని స్థానంలోనికి అవి వస్తాయి.