ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
ఈ పత్రిక యొక్క మొదటి పదం (ఆంగ్లంలో), పేతురు, తనను తాను “యేసుక్రీస్తు అపొస్తలుడు” అని పిలుచుకొని రచయితగా గుర్తించుకున్నాడు (1 పేతురు 1:1). ఆసియ మైనర్ యొక్క ఉత్తర ప్రాంతాలలో చెదరిన వారిలో ఉన్న క్రైస్తవుల గుంపుకు అతను ఈ పత్రిక రాశాడు, అక్కడ అతను ఇంతకు ముందు సువార్తను ప్రకటించి ఉంటాడు.
పేతురు యూదులు, అన్యజనులు కలిగి ఉన్న ఒక సమూహానికి రాశాడు. అపొస్తలుడు పత్రిక గ్రహీతలను “యాత్రికులు” (1:1) అని సంబోధించాడు, ఇది పేతురు యూదులతో లేదా అన్యజనులతో మాత్రమే మాట్లాడుతున్నాడని సూచించుటలేదుగాని, క్రైస్తవులు తమ చుట్టూ ఉన్న సంస్కృతిలో వారు యాత్రికులుగా ఉంటూ తమ జీవితాలను గడుపుతున్నట్లుగా సూచిస్తున్నది.
మనమెక్కడ ఉన్నాము?
ఈ పత్రికలో, పేతురు గొప్ప హింస గురించి చాలా మాట్లాడాడు, నీరో పాలన యొక్క చివరి సంవత్సరాల్లో అతను మరియు ఇతర క్రైస్తవులు శ్రమలను భరించటానికి ఎదురుచూడాలని చెప్పాడు. అతను వ్రాసిన సమయంలో, పేతురు ఇంకా ఖైదు చేయబడలేదు. సుమారు క్రీ.శ. 66-68 లో అతను ఖైదు చేయబడి హతసాక్షి అయ్యాడు. పేతురు స్థానిక సంఘము నుండి వందనములు పంపినట్లు మొదటి పేతురు 5:13 సూచిస్తుంది- ఈ సంఘమును “బబులోను” అని పిలిచాడు -అయితే అపొస్తలుడు అక్కడ ఒక సాధారణ రూపకంలో అన్నాడు. అతను పురాతన మెసపొతేమియ నగరం పేరును రోమాకు ఉపయోగించాడు. ఎందుకంటే ఈ ఆధునిక నగరం, బబులోను మాదిరిగానే, విగ్రహారాధన మరియు తప్పుడు దేవుళ్ళకు అప్పగించుకున్నది. వాస్తవం పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయబడనప్పటికీ, పేతురు తన చివరి సంవత్సరాలను రోమాలోని సంఘానికి సేవ చేసినట్లు చాలా కాలంగా భావిస్తున్నారు. ఈ పత్రికలోని శ్రమలు మరియు హింసల గురించి అనేక వచనాల ఆధారంగా, నీరో క్రింద క్రైస్తవులపై హింస పెరుగుతున్న సమయంలో పేతురు క్రీ.శ. 64 లో ఈ పత్రికను వ్రాసాడు.
మొదటి పేతురు ఎందుకంత ముఖ్యమైనది?
విశ్వాసులు అన్యాయముగా బాధలను అనుభవించినప్పటికీ మంచిగా జీవించాలని మొదటి పేతురు దృష్టి పెట్టింది (1 పేతురు 2:20). ఈ విధంగా, 1 పేతురును క్రొత్త నిబంధన యొక్క యోబు అని పిలువవచ్చు. యేసు తనను వెంబడించువారి కొరకు ఏర్పరచిన మార్గములో నిజమైన విశ్వాసి కొనసాగడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. యోబు యొక్క ఓర్పుకు సమానమైన ఓర్పు కలిగియుండాలని ఈ విశ్వాసులకు పిలుపునిచ్చాడు. యోబు నీతిమంతుడైనప్పటికీ బాధను అనుభవించాడు. దేవుడు తన ప్రజల నుండి ఆశించే నిజమైన ఓర్పు ఇదే అని పేతురు పేర్కొన్నాడు.
మొదటి పేతురు యొక్క ఉద్దేశమేమిటి?
మూడు సంవత్సరాలకు పైగా యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించడం, ప్రతికూల ప్రపంచం మధ్య పరిశుద్ధతతో జీవించడం ఎలా ఉంటుందో దానికి అపొస్తలుడైన పేతురు ఉత్తమమైన ఉదాహరణను అందించాడు. భూమిపై నడిచిన ఇతర మనుష్యులందరికన్నా, యేసు ఆ జీవన విధానాన్ని మాదిరిగా చూపించాడు. అందువల్ల పేతురు తన పాఠకులను యేసు అనే శ్రేష్ఠమైన మార్గము వైపు చూపించాడు. విశ్వాసులు ఈ భూమిమీద ఉన్న కొద్ది కాలంలో యేసు కోరుకున్నట్లుగా జీవించి, వ్యవహరించటానికి అపొస్తలుడు క్రైస్తవులను వారి హృదయములయందు “క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి” అని పిలిచాడు (1 పేతురు 3:14-18). ప్రభుత్వంలో, ఇంటిలో మరియు పనిచేసే కార్యాలయంలో అధికారమునకు-అన్యాయమైన అధికారానికి కూడా లోబడి ఉండాలి. శ్రమలు మరియు కష్టాల్లోనున్న ఒకరి జీవితాన్ని క్రమం చేయడానికి యేసు కేంద్ర బిందువు అవుతాడు. క్రీస్తు యొక్క స్వరూపము మరియు కార్యములో వారి ఓర్పు పాతుకుపోవడం ద్వారా, విశ్వాసులు ఎల్లప్పుడూ బాధల మధ్య నిరీక్షణకు అంటుకొనియుండవచ్చు.
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
అన్యాయమైన లేదా ముందుగా ఊహించని బాధ ఈ రోజున ప్రజల హృదయాలను పట్టుకునే గొప్ప సమస్యలలో ఒకటి. మనకు సమీపముగా అసాధారణమైన మరియు ఊహించని పరీక్షలు వచ్చినప్పుడు మనము నిరాశ, కోపం మరియు అనిశ్చితితో పోరాడతాము. మన జీవితంలోని చాలా కష్టమైన ఆ క్షణాలలో చాలా తరచుగా, సంతృప్తి తగ్గి గందరగోళం రాజ్యమేలుతుంది; ప్రార్థన తగ్గి ప్రశ్నలు తలెత్తుతాయి.
బాధ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించుచున్నారు? ఇంకొక నొప్పి లేదా విచారణ గురించి కేవలం ఆలోచనతోనే చాలామంది ముక్కలు చెక్కలైపోతారు. మరికొందరు ఆ సమయాల్లో పోరాడి జయమొందుతారు. మనలో చాలామంది బహుశా ఎక్కడో ఈ రెండింటి మధ్యలో ఉంటాము. విశ్వాసంలో ఓర్పు కలిగియుండుమని తన క్రైస్తవ పాఠకులకు పేతురు ప్రోత్సహించాడు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ప్రతిరోజూ కష్టముతో ప్రయాణము చేయటం మాత్రమే సరిపోదు;అలాగని మన ముఖాల్లో చిరునవ్వును అతికించుకొని సమస్యలను విస్మరించడమూ మంచిది కాదు. బదులుగా, 1 పేతురు యొక్క పాఠం ఏమిటంటే, కష్టాలను అధిగమించడం, అవి మన జీవితములలో తాత్కాలికముగా ఉండేవని గుర్తించి విశ్వాస జనాంగముగా పరిశుద్ధతలోను మరియు నిరీక్షణలోను నడవడం.
కాబట్టి పరుగెత్తండి! చీకటి సమయాల్లోనే మన సామూహిక వెలుగు ప్రకాశవంతముగా ప్రకాశిస్తుంది.